Women’s World Cup 2022: కష్టాల్లో టీమిండియా.. రెండు వికెట్లు డౌన్.. ఓడితే సెమీఫైనల్ ఆశలు గల్లంతే..

టోర్నీలో భారత జట్టు ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడగా, అందులో 2 గెలిచి 2 ఓడిపోయింది. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా టీం 4 మ్యాచులు ఆడి..

Women’s World Cup 2022: కష్టాల్లో టీమిండియా.. రెండు వికెట్లు డౌన్.. ఓడితే సెమీఫైనల్ ఆశలు గల్లంతే..
Icc Women World Cup 2022 Indw Vs Ausw
Follow us
Venkata Chari

|

Updated on: Mar 19, 2022 | 7:29 AM

India Women vs Australia Women: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022(Icc Womens World Cup 2022)లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు కీలక మ్యాచులో ముఖాముఖిగా తలపడుతున్నాయి. ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు బ్యాటింగ్ ప్రారంభమైంది. భారత జట్టుకు ఈ మ్యాచ్‌లో విజయం చాలా ముఖ్యం కాగా, ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. 10 పరుగుల వద్ద స్మృతి మంధాన(Smriti Mandhana) ఔట్‌ కావడంతో భారత్‌ తొలి వికెట్‌‌ను కోల్పోయింది. గత మ్యాచుల్లో అద్భుతంగా ఆకట్టుకున్న మంధాన, ఈ మ్యాచులో ఆరంభంలోనే పెవిలియన్ చేరుకుంది. ఆ వెంటనే 12 పరుగుల వద్ద షెఫాలీ వర్మ(Shafali Verma) పెవిలియన్ చేరుకుంది. దీంతో 12 ఓవర్లు ముగిసే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. మిథాలీ, యాస్తిక జోడీ క్రీజులో ఉన్నారు.

మరోవైపు ఈరోజు ఆస్ట్రేలియా గెలిస్తే సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. భారత్ ఓడిపోతే సెమీఫైనల్ ఆశలు ప్రమాదంలో పడినట్లే. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ జులన్ గోస్వామి, బెత్ మూనీలకు ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. భారత క్రీడాకారిణి జులన్ గోస్వామికి ఇది 200వ వన్డే మ్యాచ్. అదే సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీకి ఇది 50వ వన్డే. మిథాలీ రాజ్ తర్వాత 200 వన్డేలు ఆడిన రెండో క్రీడాకారిణి జులన్ రికార్డు నెలకొల్పింది.

టోర్నీలో భారత జట్టు ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడగా, అందులో 2 గెలిచి 2 ఓడిపోయింది. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా టీం 4 మ్యాచులు ఆడి నాలుగింట్లోనూ విజయం సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

రెండు జట్ల XI ప్లేయింగ్..

ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI : అలిస్సా హీలీ, రాచెల్ హైన్స్, మాగ్ లెన్నింగ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, తహిలా మెక్‌గ్రాత్, ఆష్లే గార్డనర్. డార్సీ బ్రౌన్, జెస్ జోనాస్సేన్, అలానా కింగ్, మేగాన్ షట్

భారత ప్లేయింగ్ XI : స్మృతి మంధాన, యాస్తికా భాటియా, మిథాలీ రాజ్, షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, స్నేహ రాణా, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్

Also Read: SA vs BAN: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. దక్షిణాఫ్రికాకే చుక్కలు చూపించిందిగా.. తొలి వన్డేలో ఘన విజయం..

Kolkata Knight Riders, IPL 2022: మరో ట్రోఫీపై కన్నేసిన కేకేఆర్.. శ్రేయాస్ సారథ్యంలో సరికొత్తగా బరిలోకి..