Kolkata Knight Riders, IPL 2022: మరో ట్రోఫీపై కన్నేసిన కేకేఆర్.. శ్రేయాస్ సారథ్యంలో సరికొత్తగా బరిలోకి..

కోల్‌కతా నైట్ రైడర్స్ కొత్త కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. మార్చి 26న చెన్నై సూపర్ కింగ్స్‌తో కేకేఆర్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

Kolkata Knight Riders, IPL 2022: మరో ట్రోఫీపై కన్నేసిన కేకేఆర్.. శ్రేయాస్ సారథ్యంలో సరికొత్తగా బరిలోకి..
Ipl 2022 Kolkata Knight Riders
Follow us
Venkata Chari

|

Updated on: Mar 18, 2022 | 3:30 PM

2012, 2014లో ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌(Kolkata Knight Riders) గత 8 ఏళ్లుగా ఛాంపియన్‌ టైటిల్‌ను కోల్పోయింది. గౌతమ్ గంభీర్ సారథ్యంలో రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు.. ఆ తర్వాత ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. కానీ, ప్రస్తుతం ఈ జట్టును ఛాంపియన్‌గా మార్చగల సత్తా ఉన్న కొత్త యువ, ప్రతిభావంతుడైన ఆటగాడిని కెప్టెన్‌గా ఎన్నుకుంది. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో, కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ (IPL 2022) లోకి ప్రవేశించబోతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ తమ నలుగురు ముఖ్యమైన ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్ ఈ లిస్టులో ఉన్నారు. ఈ నలుగురు ఆటగాళ్లు బిగ్ మ్యాచ్ విన్నర్‌లు కాగా, ఆ తర్వాత చాలా మంది యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లను కూడా ఆ జట్టు వేలంలో కొనుగోలు చేసింది.

పాట్ కమిన్స్, నితీష్ రాణా, రింకూ సింగ్, సామ్ బిల్లింగ్స్, ఆరోన్ ఫించ్, మహ్మద్ నబీ వంటి వారు కోల్‌కతా జట్టులో ఉన్నారు. ప్రస్తుతం ప్రశ్న ఏమిటంటే, శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో ప్లేయింగ్ XI ఎలా ఉందనుందనేది తెలియాల్సి ఉంది. అయితే ఈలోపు కొన్ని వార్తల మేరకు కోల్‌కతా బెస్ట్ ప్లేయింగ్ XI ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

KKR బ్యాట్స్‌మెన్స్..

కోల్‌కతా జట్టు వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్‌లతో ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇటీవల బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో నరైన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ బాధ్యతను నరేన్‌కు అప్పగించవచ్చు. అలెక్స్ హేల్స్ స్థానంలో ఆరోన్ ఫించ్‌ని కూడా జట్టుతో ఉన్నాడు. ఇక కేకేఆర్ ఓపెనింగ్ ఎవరికి దక్కుతుందో చూడాలి. కానీ, ఇద్దరు ఆటగాళ్లు జట్టులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మూడో స్థానంలో నిలవగా, నాల్గవ స్థానాన్ని నితీష్ రాణాకు కేటాయించినట్లు తెలుస్తోంది. వికెట్ కీపింగ్ బాధ్యత షెల్డన్ జాక్సన్‌ చేపట్టున్నాడు. అతను బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేయగలడు.

KKR ఆల్ రౌండర్-బౌలర్స్..

కేకేఆర్ మ్యాచ్ విన్నర్‌గా ఆండ్రీ రస్సెల్ ప్లేయింగ్ XIలో కచ్చితంగా ఉంటాడు. ఈ జట్టులో పాట్ కమిన్స్ కూడా భాగం కాబోతున్నాడు. బౌలర్లలో ఉమేష్ యాదవ్, శివమ్ మావి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండవచ్చు. అదే సమయంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఈ జట్టు బలాన్ని పెంచే అవకాశం ఉంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI – ఆరోన్ ఫించ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా, షెల్డన్ జాక్సన్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, పాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి.

Also Read: Team India: ‘షమీకి ఇదే చివరి ఛాన్స్.. టీ20 ప్రపంచకప్‌లో ఆడాలంటే, అక్కడ రాణించాల్సిందే.. లేదంటే’

IPL 2022: స్పాట్ ఫిక్సింగ్ నుంచి షారుఖ్ ఖాన్ నిషేధం వరకు.. ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద వివాదాలు ఇవే..