IPL 2022: ఐపీఎల్ 2022కు దూరమైన మరో కీలక ఆటగాడు.. గాయం కారణంగా తప్పుకున్న బౌలర్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022(IPL 2022) ప్రారంభం కావడానికి కొద్ది ముందు.. లక్నో సూపర్‌జెయింట్స్(lucknow super giants) పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022(IPL 2022) ప్రారంభం కావడానికి కొద్ది ముందు.. లక్నో సూపర్‌జెయింట్స్(lucknow super giants) పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. లక్నో ఫాస్టెస్ట్ బౌలర్, మ్యాచ్ విన్నర్ మార్క్ వుడ్(mark wood)ను సేవల్ని కోల్పోనుంది. గాయం కారణంగా మార్క్ వుడ్ IPL 2022కు దూరమయ్యాడు. వెస్టిండీస్‌తో ఆంటిగ్వా టెస్టులో మార్క్ వుడ్ మోచేయికి గాయమైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేకపోయాడు. రెండో టెస్టులో మార్క్ వుడ్‌కు అవకాశం ఇవ్వలేదు.ఇప్పుడు అతను IPL 2022లో ఆడడని బ్యాడ్ న్యూస్ వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్ కీలక ఆటగాళ్లలో మార్క్ వుడ్ ఒక్కడు. వుడ్‌కు గంటకు 145 కి.మీ. వేగంతో బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉంది. లక్నో ఈ ఫాస్ట్ బౌలర్‌ను 7.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయడానికి కారణం ఇదే.
అయితే అతను గాయంతో తప్పుకోవడం లక్నో సూపర్‌జెయింట్‌కు పెద్ద ఎదురుదెబ్బే. మార్క్ వుడ్ గాయం కూడా ఇలాగే ఉంటే.. ఈ ఫాస్ట్ బౌలర్ కు టీ20 ప్రపంచకప్ ఆడడం కష్టంగానే కనిపిస్తోంది. ఐపీఎల్ 2022కి ముందు ఇంగ్లండ్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ఈ టోర్నమెంట్‌కు దూరమయ్యారు. మార్క్ వుడ్ కంటే ముందు, బయో బబుల్ అలసట కారణంగా జాసన్ రాయ్ తన పేరును ఉపసంహరించుకున్నాడు. అతను గుజరాత్ టైటాన్స్‌లో భాగంగా ఉన్నాడు. అదే సమయంలో కోల్‌కతా ఓపెనర్ అలెక్స్ హేల్స్ కూడా ఇదే కారణంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. మార్చి 26న చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మ్యాచ్‌తో ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కానుంది.
Read Also.. Kolkata Knight Riders, IPL 2022: మరో ట్రోఫీపై కన్నేసిన కేకేఆర్.. శ్రేయాస్ సారథ్యంలో సరికొత్తగా బరిలోకి..