IPL 2022 RCB: విధ్వంసకరమైన ప్లేయర్లు.. ప్రమాదకరమైన బౌలర్లు.. అయినా కప్పు కొట్టేనా..!

IPL 2022 RCB: రాయల్‌ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) ఈసారి IPL 2022 లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విరాట్ కోహ్లి చాలా కాలం కెప్టెన్‌గా ఉన్నప్పటికీ టైటిల్ గెలవలేకపోయాడు.

IPL 2022 RCB: విధ్వంసకరమైన ప్లేయర్లు.. ప్రమాదకరమైన బౌలర్లు.. అయినా కప్పు కొట్టేనా..!
Rcb
Follow us
uppula Raju

|

Updated on: Mar 19, 2022 | 5:57 AM

IPL 2022 RCB: రాయల్‌ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) ఈసారి IPL 2022 లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విరాట్ కోహ్లి చాలా కాలం కెప్టెన్‌గా ఉన్నప్పటికీ టైటిల్ గెలవలేకపోయాడు. కానీ ఈసారి ఆర్సీబీ కొత్త కెప్టెన్, కొత్త ఆలోచనతో రంగంలోకి దిగబోతోంది. వాస్తవానికి బెంగుళూరు జట్టు వేలంలో చాలా మార్పులకి గురైంది. కొందరు దేశీయ, విదేశీ ఆటగాళ్లని మిస్‌ చేసుకుంది. ఈ పరిస్థితిలో ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్సీలో ప్లేయింగ్ ఎలెవన్ దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. RCB గత సీజన్ నుంచి ముఖ్యమైన ప్లేయర్లని కోల్పోయింది. అందులో AB డివిలియర్స్ ఒకరు. ఇతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. అలాగే మరో బిగ్ మ్యాచ్ విన్నర్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇతడు కూడా ఇప్పుడు జట్టులో లేడు. దేవదత్ పడిక్కల్ వంటి యువ ఓపెనర్‌ను జట్టు కోల్పోయింది. ఈ పరిస్థితిలో జట్టులోని కొన్ని కీలక భాగాలను పూరించడం అంత సులభం కాదు.

ఆర్సీబీ బ్యాటింగ్ భారం మొత్తం విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్‌పైనే ఉంది. డివిలియర్స్ నిష్క్రమణ కారణంగా లోటు ఏర్పడుతుంది. అయితే డుప్లెసిస్ ఓపెనింగ్ చేస్తే.. కోహ్లీ అతడికి తోడుగా వస్తాడా లేక మరొకరు వస్తారా అనేది ప్రశ్న. ఢిల్లీ క్రికెట్ జట్టుకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అనూజ్ రావత్‌ను RCB కొనుగోలు చేసింది. ఇతడు ఓపెనింగ్‌ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లి మూడో ర్యాంక్‌లోకి వచ్చి మిడిలార్డర్‌ను బలోపేతం చేస్తాడు. అతడితో పాటు ఫినిషర్ పాత్రలో దినేష్ కార్తీక్ కనిపిస్తాడు. ఐదో నంబర్‌లో కూడా తర్జన భర్జన నెలకొంది. సుయాష్ ప్రభుదేశాయ్, మహిపాల్ లోమోర్డ్ వంటి దేశీయ క్రికెట్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో సుయాష్ ఇప్పటివరకు IPLలో కనిపించలేదు. అయితే అతను చాలా దూకుడుగా ఉండే బ్యాట్స్‌మెన్. కానీ ఎడమచేతి వాటం బ్యాటింగ్ కారణంగా మహిపాల్‌కు అవకాశం లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

జట్టుకు అద్భుతమైన బౌలింగ్‌ ఎటాక్‌ ఉంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, హర్షల్ పటేల్ త్రయం విధ్వంసం సృష్టించగల సత్తా ఉంది. గత సీజన్‌లో ముగ్గురి ప్రదర్శన చాలా బాగుంది. మరోవైపు హసరంగా, షాబాజ్ అహ్మద్‌లు తమ సత్తా చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసారి వికెట్లు తీసే చాహల్ లేడు. వారికి మద్దతుగా మాక్స్‌వెల్, లోమోర్స్ స్పిన్ అందుబాటులో ఉంటుంది.

RCB ప్రాబబుల్ ప్లేయింగ్ XI

ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమోర్డ్, దినేష్ కార్తీక్ (WK), వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్

Mla Shakeel Car Accident: జూబ్లీహిల్స్ కారు ప్రమాదంలో కీలక మలుపు.. వ్యక్తమవుతున్న అనేక సందేహాలు..!

IND vs AUS: ఆస్ట్రేలియాని ఓడించడం అంత సులువు కాదు.. ఎందుకంటే ఈ 5గురు ప్లేయర్లు చాలా డేంజర్..!

Clouds: మేఘాలు నలుపు రంగులో ఉంటాయి.. కానీ దీని వెనుక దాగున్న సీక్రెట్‌ ఏంటో తెలుసా..?