SA vs BAN: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. దక్షిణాఫ్రికాకే చుక్కలు చూపించిందిగా.. తొలి వన్డేలో ఘన విజయం..
3 వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 38 పరుగుల తేడాతో గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ సెంచూరియన్ వేదికగా జరిగింది.
దక్షిణాఫ్రికాలో బంగ్లాదేశ్(Bangladesh) చరిత్ర సృష్టించింది. సౌతాఫ్రికా(South Africa) గడ్డపై తొలిసారి వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును ఓడించి అద్భుతాలు చేసింది. 3 వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 38 పరుగుల తేడాతో గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ సెంచూరియన్ వేదికగా జరిగింది. దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ విజయంలో షకీబ్ అల్ హసన్(Shakib Al Hasan), తస్కిన్ అహ్మద్ కీలక పాత్ర పోషించారు. షకీబ్ తన బ్యాట్‌తో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడగా, తస్కిన్ బంతితో విధ్వంసం సృష్టించాడు. దక్షిణాఫ్రికా గడ్డపై బంగ్లాదేశ్‌కి ఇది 20వ మ్యాచ్. అంతకుముందు ఆడిన 19 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కానీ, ఈసారి ఆ ఓటమి గుడ్ బై చెప్పి, సరికొత్త చరిత్ర సృష్టించింది.
షకీబ్ సూపర్ ఇన్నింగ్స్..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా టీం బంగ్లాదేశ్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆదేశించింది. బంగ్లాదేశ్ ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్ జట్టుకు శుభారంభం అందించారు. వీరిద్దరూ ఓపెనింగ్ వికెట్‌కు 95 పరుగులు జోడించారు. అయితే, ఈ వికెట్ తర్వాత, దక్షిణాఫ్రికా తదుపరి 29 పరుగులకు మరో రెండు వికెట్లను పడగొట్టింది. కానీ, ఆ తర్వాత నాలుగో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యంతో బంగ్లాదేశ్ భారీ స్కోరుకు స్క్రిప్ట్ రాసింది. బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఇందులో షకీబ్ అల్ హసన్ 64 బంతుల్లో 77 పరుగులు చేశాడు. 44 బంతుల్లో 50 పరుగులు చేసిన యాసిర్ అలీతో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
అనంతరం దక్షిణాఫ్రికా టీం 276 పరుగులకే ఆలౌట్ అయింది. ఇందులో రాస్సీ వాన్ డెర్ డస్సెన్ 86, డేవిడ్ మిల్లర్ 79 పరుగులతో రాణించారు. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో మోహిదీ హసన్ 4, తస్కిన్ అహ్మద్ 3, షారిఫుల్ ఇస్లాం 2, మహ్మదుల్లా 1 వికెట్ పడగొట్టారు.
That winning feeling ?
Bangladesh’s 38-run win in Centurion was their first ODI victory on South African soil.#SAvBAN | https://t.co/LBaOXJFA9B pic.twitter.com/WMcO4XGgfn
— ICC (@ICC) March 18, 2022
Also Read: IPL 2022 RCB: విధ్వంసకరమైన ప్లేయర్లు.. ప్రమాదకరమైన బౌలర్లు.. అయినా కప్పు కొట్టేనా..!