Cricket News: రోహిత్ శర్మతో ఐపీఎల్ ఆడిన ఈ ముగ్గురు ప్లేయర్ల కెరీర్ ముగిసినట్లే..!
Cricket News: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో కూడా అత్యంత విజయవంతమైన కెప్టెన్. రోహిత్ 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. రోహిత్ ప్లేయర్‌గా 6 సార్లు
Cricket News: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో కూడా అత్యంత విజయవంతమైన కెప్టెన్. రోహిత్ 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. రోహిత్ ప్లేయర్‌గా 6 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచాడు. కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్‌ను 5 సార్లు ఛాంపియన్ చేశాడు. ఈసారి కూడా IPLలో రోహిత్ ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ఐపిఎల్‌లో రోహిత్ శర్మతో ఆడిన ముగ్గురు ఆటగాళ్లు ఇప్పుడు మైదానంలో కనిపించరు. ఎందుకంటే వాళ్లు ఇప్పుడు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. వీరి గురించి చాలా తక్కువ మందికి తెలుసు.
క్లయింట్ మెక్‌కాయ్
క్లయింట్ మెక్‌కాయ్ ఒక ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్. మెక్‌కాయ్ చాలా సంవత్సరాలుగా ఆస్ట్రేలియా జట్టులో భాగంగా ఉన్నాడు. అతని ఎత్తు కారణంగా మెక్‌కాయ్ వేగంగా బౌలింగ్ చేసేవాడు. మెక్‌కాయ్ 2009లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశాడు. చివరిగా 2014లో ఆస్ట్రేలియా తరఫున ఆడాడు. ఐపీఎల్‌లో రోహిత్ శర్మతో కలిసి మెక్‌కాయ్ కూడా ఆడాడు. అతను IPL 2012లో MIకి ఎంపికయ్యాడు. 50 లక్షలకు కొనుగోలు చేశారు. కానీ మెక్‌కాయ్ ముంబై తరపున 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2013లో హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది. రోహిత్‌తో కలిసి ఐపీఎల్ ఆడిన మెక్‌కాయ్ ఇప్పుడు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు.
రాబిన్ పీటర్సన్
దక్షిణాఫ్రికాకు చెందిన రాబిన్ పీటర్సన్ కూడా ఐపీఎల్‌లో రోహిత్ కెప్టెన్సీలో ఆడాడు. 2011 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రాబిన్ పీటర్సన్ వార్తల్లో నిలిచాడు. రాబిన్ పీటర్సన్ 2012లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మతో కలిసి ఆడాడు. పీటర్సన్‌ను ముంబై ఇండియన్స్ 2012లో రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. పీటర్సన్ రోహిత్ శర్మతో కలిసి 5 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. కానీ 32 పరుగులతో 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. పీటర్సన్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ నవంబర్ 2014లో ఆడాడు. రాబిన్ పీటర్సన్ కూడా ఇప్పుడు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు.
సంజయ్ బంగర్
ఈ జాబితాలో అత్యంత షాకింగ్ పేరు సంజయ్ బంగర్ ది. ఐపీఎల్‌లో రోహిత్ శర్మతో కలిసి సంజయ్ బంగర్ కూడా ఆడాడు. ఐపీఎల్ 2008లో రోహిత్, సంజయ్ బంగర్ కలిసి ఆడారు. ఆ సమయంలో బంగర్ తన కెరీర్ చివరిలో ఉన్నాడు. అతని వయస్సు 35 సంవత్సరాలు. బంగర్ ఐపీఎల్‌లో మొత్తం 12 మ్యాచ్‌లు ఆడాడు. ఈ 12 మ్యాచ్‌ల్లో బంగర్ 49 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. బంగర్ తన చివరి ఐపీఎల్ మ్యాచ్ 2009లో రాజస్థాన్‌తో ఆడాడు.