MMRCL Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ముంబై మెట్రోలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

MMRCL Recruitment 2022: ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్, మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

MMRCL Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ముంబై మెట్రోలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!
Mmrcl Recruitment 2022
Follow us

|

Updated on: Mar 19, 2022 | 5:58 AM

MMRCL Recruitment 2022: ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్, మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మార్చి 9 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేయడానికి చివరి తేదీ 15 ఏప్రిల్ 2022గా నిర్ణయించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించాలి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద మొత్తం 27 పోస్టులను రిక్రూట్ చేస్తారు. 5 అసిస్టెంట్ జనరల్ మేనేజర్, 2 అసిస్టెంట్ మేనేజర్, 2 డిప్యూటీ ఇంజనీర్, 1 జూనియర్ సూపర్‌వైజర్, 16 జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ (IT) 1 పోస్ట్ ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు ఒక్కసారి నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలని సూచించింది. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఎలా దరఖాస్తు చేయాలి..?

ఈ పోస్టులకి దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి. అవసరమైన పత్రాలను జతచేయాలి. ‘డిప్యూటీ జనరల్ మేనేజర్ (HR), ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, MMRCL-లైన్ 3 ట్రాన్సిట్ ఆఫీస్, E. బ్లాక్., బాంద్రా కుర్లా కాంప్లెక్స్, బాంద్రా (తూర్పు) ముంబై-400051’కి పంపించాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.

IND vs AUS: ఆస్ట్రేలియాని ఓడించడం అంత సులువు కాదు.. ఎందుకంటే ఈ 5గురు ప్లేయర్లు చాలా డేంజర్..!

Clouds: మేఘాలు నలుపు రంగులో ఉంటాయి.. కానీ దీని వెనుక దాగున్న సీక్రెట్‌ ఏంటో తెలుసా..?

Mla Shakeel Car Accident: జూబ్లీహిల్స్ కారు ప్రమాదంలో కీలక మలుపు.. వ్యక్తమవుతున్న అనేక సందేహాలు..!