T20 World Cup : అంధ మహిళల టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమిండియా.. అభినందనలు తెలిపిన మంత్రి వీరాంజనేయస్వామి
భారత క్రీడా చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచింది. మొట్టమొదటిసారిగా నిర్వహించిన టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకుని భారత అంధ మహిళల క్రికెట్ జట్టు ఒక చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఫైనల్ మ్యాచ్‌లో పటిష్టమైన నేపాల్ జట్టుతో తలపడిన భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించి, యావత్ భారత జాతి గర్వపడేలా చేసింది.

T20 World Cup : భారత క్రీడా చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచింది. మొట్టమొదటిసారిగా నిర్వహించిన టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకుని భారత అంధ మహిళల క్రికెట్ జట్టు ఒక చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఫైనల్ మ్యాచ్‌లో పటిష్టమైన నేపాల్ జట్టుతో తలపడిన భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించి, యావత్ భారత జాతి గర్వపడేలా చేసింది. ఈ టోర్నమెంట్‌లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక, యూఏఈ జట్లు కూడా పోటీపడ్డాయి. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా భారత జట్టు ఛాంపియన్‌గా నిలవడం విశేషం.
దృఢ సంకల్పంతో ఆడిన భారత జట్టు ఫైనల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ స్కోరుకు ప్రధాన కారణం భారత బౌలర్లు, ఫీల్డర్ల కట్టుదిట్టమైన ప్రదర్శన. భారత బౌలర్లు చాలా పకడ్బందీగా బౌలింగ్ చేయడంతో నేపాల్ ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క బౌండరీ మాత్రమే నమోదైంది. బౌలింగ్‌తో పాటు పదునైన ఫీల్డింగ్ కారణంగా నేపాల్ బ్యాటర్లు పరుగులు తీయడానికి, బౌండరీల కోసం ప్రయత్నించడానికి చాలా కష్టపడ్డారు.
We are the Champions – SBI 1st Women’s T20 World Cup Cricket for the Blind 2025 pic.twitter.com/QX1DHsyYTJ
— Cricket Association for the Blind in India (CABI) (@blind_cricket) November 23, 2025
115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత జట్టు ఏ మాత్రం ఒత్తిడికి గురికాకుండా సులువుగా లక్ష్యాన్ని చేరుకుంది. భారత జట్టు కేవలం 12 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్ వీరత్వం చూపించిన ఫూలా సరెన్ కేవలం 27 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆమె వేగవంతమైన ఇన్నింగ్స్‌తో భారత్ త్వరగా గెలుపు తీరాలకు చేరడానికి మార్గం సుగమమైంది. ఈ విజయం జట్టు సభ్యులందరి సమిష్టి కృషి, ఆత్మవిశ్వాసం, పట్టుదలకు నిదర్శనం.
మొదటి అంధ మహిళల ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి జట్టును ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం దేశ మహిళా క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అని ఆయన కొనియాడారు. భారత జట్టు ప్రదర్శన దేశ శక్తిని, మహిళల పట్టుదలను ప్రపంచానికి చాటి చెప్పిందని, ఈ విజయం దేశంలోని ప్రతి క్రీడాకారునికి స్ఫూర్తినిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అద్భుత విజయం భారత క్రీడా ప్రపంచంలో ఒక కొత్త ఆశకు, నమ్మకానికి నాంది పలికింది.
View this post on Instagram
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
