Ind vs Pak: రిజర్వ్ డే తెచ్చిన తంట.. 2 రోజుల్లో 2 వన్డేలు ఆడనున్న రోహిత్ సేన..
Asia cup 2023: నిబంధనల ప్రకారం వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మ్యాచ్ ఫలితం రావాలంటే రెండు ఇన్నింగ్స్‌లలో కనీసం 20-20 ఓవర్లు ఆడాలి. అంటే రిజర్వ్ డే రోజు వర్షం పడితే మ్యాచ్ ఫలితం దక్కించుకోవడానికి పాకిస్థాన్ కనీసం 20 ఓవర్లు బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత మాత్రమే డక్‌వర్త్ లూయిస్ నియమం నుంచి ఫలితం పొందవచ్చు. పాక్ జట్టు 20 ఓవర్లు కూడా ఆడలేకపోతే, మ్యాచ్ రద్దు చేయబడినట్లు పరిగణిస్తారు.

India vs Pakistan, Asia Cup 2023: ఆసియా కప్ 2023 సూపర్-4 రౌండ్‌లో ఆదివారం (సెప్టెంబర్ 10) భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా నేటికి వాయిదా పడింది. అయితే నేడు కూడా ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడుతున్నాడు. ఈ మ్యాచ్ ఈరోజు అంటే రిజర్వ్ డే (సెప్టెంబర్ 11)న కూడా పూర్తి కావడం కష్టమేనని తెలుస్తోంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఆట నిలిచిపోయే సమయానికి 24.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. నేడు రిజర్వ్ డేలో కూడా భారత జట్టు ఈ స్కోరుతోనే ఆడడం ప్రారంభించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, తడి ఔట్ ఫీల్డ్ కారణంగా మ్యాచ్ ప్రారంభం ఆలస్యమవుతోంది.
వరుసగా 2 రోజుల్లో 2 వన్డే మ్యాచ్‌లు..
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. వర్షం కారణంగా మ్యాచ్ రిజర్వ్ డేకి మారడంతో భారత జట్టులో టెన్షన్ బాగా పెరిగిపోయింది. దీనికి కారణం ఇప్పుడు ఆ జట్టు వరుసగా 2 రోజుల్లో 2 మ్యాచ్‌లు ఆడాల్సి రావడమే. పాకిస్థాన్‌తో వాయిదా పడిన మ్యాచ్ సెప్టెంబర్ 11న పూర్తి చేయాల్సి ఉంది. వర్షం కురవకపోతే ఈ మ్యాచ్‌లో భారత జట్టు 25.5 ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 50 ఓవర్ల బౌలింగ్ కూడా చేయాల్సి ఉంటుంది.
వీరితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా తమ పనిభారాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ప్రపంచకప్‌నకు ముందు ఈ ఆటగాళ్లలో ఎవరైనా గాయపడితే అది టీమిండియాకు పెద్ద దెబ్బే. అయితే, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌ను వికెట్ కీపర్‌గా ఉపయోగించుకున్నట్లు బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్‌కి కాస్త ఊరట లభించనుంది.
మూడో మ్యాచ్ బంగ్లాదేశ్‌తో..
శ్రీలంక తర్వాత భారత జట్టు సూపర్-4 రౌండ్‌లో బంగ్లాదేశ్‌తో తన మూడో, చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 15న జరగనుంది. ఈ టైట్ షెడ్యూల్‌లో జట్టుకు ఒక మంచి విషయం ఏమిటంటే, ఈ మ్యాచ్‌లన్నీ కొలంబోలో మాత్రమే జరగనున్నాయి. అంటే ఆటగాళ్లు ఎక్కువసేపు ప్రయాణించాల్సిన అవసరం ఉండదు.
రిజర్వ్ రోజు కూడా వర్షం పడితే ఏమవుతుంది?
నిబంధనల ప్రకారం వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మ్యాచ్ ఫలితం రావాలంటే రెండు ఇన్నింగ్స్‌లలో కనీసం 20-20 ఓవర్లు ఆడాలి. అంటే రిజర్వ్ డే రోజు వర్షం పడితే మ్యాచ్ ఫలితం దక్కించుకోవడానికి పాకిస్థాన్ కనీసం 20 ఓవర్లు బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత మాత్రమే డక్‌వర్త్ లూయిస్ నియమం నుంచి ఫలితం పొందవచ్చు. పాక్ జట్టు 20 ఓవర్లు కూడా ఆడలేకపోతే, మ్యాచ్ రద్దు చేయబడినట్లు పరిగణిస్తారు.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో ప్లేయింగ్-11..
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
పాకిస్థాన్ జట్టు: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




