AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK, Asia Cup 2023, Highlights: కుల్దీప్ దెబ్బ పాక్ అబ్బా.. భారత్ ఘన విజయం..

IND vs PAK, Asia Cup 2023, Highlights: పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. 228 పరుగుల తేడాతో గెలుపొందింది టీమ్ ఇండియా. భారత్‌ 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేయగా.. 357 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 32 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. టీమిండియా బ్యాట్స్‌మెన్ కోహ్లి, కేఎల్‌ రాహుల్ సెంచరీలతో కదం తొక్కగా.. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలు సాధించారు. ఇక ఆల్ రౌండర్ కుల్‌దీప్ యాదవ్.. తన మ్యాజిక్ బౌలింగ్‌తో పాక్ జట్టును మట్టికరిపించాడు. వరుసగా 5 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు.

IND vs PAK, Asia Cup 2023, Highlights: కుల్దీప్ దెబ్బ పాక్ అబ్బా.. భారత్ ఘన విజయం..
Ind Vs Pak
Venkata Chari
| Edited By: Shiva Prajapati|

Updated on: Sep 11, 2023 | 11:16 PM

Share

IND vs PAK, Asia Cup 2023, Highlights: పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. 228 పరుగుల తేడాతో గెలుపొందింది టీమ్ ఇండియా. భారత్‌ 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేయగా.. 357 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 32 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. టీమిండియా బ్యాట్స్‌మెన్ కోహ్లి, కేఎల్‌ రాహుల్ సెంచరీలతో కదం తొక్కగా.. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలు సాధించారు. ఇక ఆల్ రౌండర్ కుల్‌దీప్ యాదవ్.. తన మ్యాజిక్ బౌలింగ్‌తో పాక్ జట్టును మట్టికరిపించాడు. వరుసగా 5 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు.

ఇరుజట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 11 Sep 2023 11:06 PM (IST)

    పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం..

    పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. 228 పరుగుల తేడాతో గెలుపొందింది టీమ్ ఇండియా. భారత్‌ 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేయగా.. 357 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 32 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. టీమిండియా బ్యాట్స్‌మెన్ కోహ్లి, కేఎల్‌ రాహుల్ సెంచరీలతో కదం తొక్కగా.. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలు సాధించారు. ఇక ఆల్ రౌండర్ కుల్‌దీప్ యాదవ్.. తన మ్యాజిక్ బౌలింగ్‌తో పాక్ జట్టును మట్టికరిపించాడు. వరుసగా 5 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు.

  • 11 Sep 2023 10:59 PM (IST)

    కుల్దీప్ దెబ్బకు పాక్ కుదేల్.. 8 వికెట్ ఔట్..

  • 11 Sep 2023 10:52 PM (IST)

    కుల్దీప్ యాదవ్ ఆన్ ఫైర్.. వరుసగా 3 వికెట్లతో హ్యాట్రిక్..

    భారత్ బౌలర్ కుల్దీప్ యాదవ్ దెబ్బకు పాకిస్తాన్ విలవిల్లాడిపోతోంది. ఫుల్ ఫైర్‌లో ఉన్న కుల్దీప్.. కేవలం 23 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక వరుసగా వెంట వెంటనే 3 వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ సాధించాడు.

  • 11 Sep 2023 10:49 PM (IST)

    కుల్దీప్ యాదవ్ దెబ్బ.. పాక్ అబ్బా..

  • 11 Sep 2023 10:48 PM (IST)

    7వ వికెట్ కోల్పోయిన పాక్..

  • 11 Sep 2023 10:46 PM (IST)

    6వ వికెట్ కోల్పోయిన పాక్.. షాదాబ్ ఖాన్ ఔట్..

    కుల్దీప్ యాదవ్ దెబ్బకు పాక్ బ్యాటర్స్ విలవిల్లాడిపోతున్నారు. క్రీజ్‌లోకి వచ్చిన ఏ ఒక్కరూ నిలవలేకపోతున్నారు. వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియన్ బాట పడుతున్నారు. తాజాగా పాకిస్తాన్ 6 వికెట్ కోల్పోయింది. షాదాబ్ ఖాన్ క్యాచ్ ఔట్ అయ్యారు. ప్రస్తుతం పాకిస్తాన్ స్కోర్.. 119/6 (29.3)

     

  • 11 Sep 2023 10:33 PM (IST)

    5వ వికెట్ కోల్పోయిన పాక్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయిన ఆఘా సల్మాన్..

    ఆసియా కప్‌లో భారత్‌-పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌‌లో పాక్ 5 వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ ఔట్ అయ్యాడు ఆఘా సల్మాన్. ప్రస్తుతం పాక్ స్కోర్ 107/5 (26.3).

  • 11 Sep 2023 10:28 PM (IST)

    4వ వికెట్ కోల్పోయిన పాక్..

  • 11 Sep 2023 09:24 PM (IST)

    3వ వికెట్ డౌన్..

    వర్షం తగ్గిన అనంతరం మొదలైన మ్యాచ్ లో పాక్ కు గట్టి దెబ్బ తగిలింది. శార్దుల్ బౌలింగ్ లో రిజ్వాన్ (2) పరుగులకే పెవిలియన్ చేరాడు.

  • 11 Sep 2023 08:13 PM (IST)

    వర్షంతో ఆడిన ఆట..

    11 ఓవర్ల తర్వాత వర్షం పడడంతో హోరాహోరీగా సాగుతోన్న మ్యాచ్ ఆగిపోయింది. ప్రస్తుతం పాక్ 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది.

  • 11 Sep 2023 08:07 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన పాక్..

    పాక్ సారథి బాబర్ అజాం (10) పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో పాక్ 43 పరుగుల వద్ద 2 వ వికెట్‌ను కోల్పోయింది.

  • 11 Sep 2023 08:06 PM (IST)

    పూర్తయిన పవర్ ప్లే..

    పాకిస్థాన్ 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. ఓపెనర్ ఫఖర్ జమాన్, కెప్టెన్ బాబర్ ఆజం క్రీజులో ఉన్నారు.

  • 11 Sep 2023 07:34 PM (IST)

    తొలి వికెట్ డౌన్..

    బుమ్రా వేసిన అద్భుత బంతిని అంచనా వేయడంలో విఫమైన ఇమాముల్ హక్ స్లిప్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో పాకిస్తాన్ టీం 17 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.

  • 11 Sep 2023 06:45 PM (IST)

    పాకిస్తాన్ టార్గెట్ 357

    ఆసియా కప్‌లో భాగంగా జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు భారత్ 357 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రిజర్వ్‌ డేలో భారత జట్టు 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 పరుగులు చేసింది. ఈ టోర్నీలో పాకిస్థాన్‌పై భారత్‌కు ఇదే అతిపెద్ద స్కోరు కావడం గమనార్హం.

  • 11 Sep 2023 06:28 PM (IST)

    సెంచరీ బాదిన కోహ్లీ..

    విరాట్ కోహ్లీ 84 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో సెంచరీ పూర్తి చేశాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ 48 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 330 పరుగులు పూర్తి చేసింది.

  • 11 Sep 2023 06:24 PM (IST)

    సెంచరీ కొట్టిన రాహుల్..

    రాహుల్ పునరాగమనంలో 100 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి సత్తా చాటాడు. ఇందులో 10 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.

  • 11 Sep 2023 06:15 PM (IST)

    300 దాటిన స్కోర్..

    45 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. రాహుల్ 95, కోహ్లీ 83 పరుగులు సాధించారు.

  • 11 Sep 2023 05:54 PM (IST)

    కోహ్లీ హాఫ్ సెంచరీ..

    భారత జట్టు 40 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు. వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం ఉంది.

    రాహుల్ తన కెరీర్‌లో 60 బంతుల్లో 14వ ఫిఫ్టీని పూర్తి చేయగా, కోహ్లీ 66వ అర్ధశతకం సాధించాడు.

  • 11 Sep 2023 05:33 PM (IST)

    రాహుల్ హాఫ్ సెంచరీ..

    భారత జట్టు 36 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు. వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం నెలకొంది. ఈక్రమంలో రాహుల్ 60 బంతుల్లో కెరీర్‌లో 14వ ఫిఫ్టీని పూర్తి చేయగా, కోహ్లి 66వ ఫిఫ్టీకి చేరువలో ఉన్నాడు.

  • 11 Sep 2023 05:09 PM (IST)

    ధాటిగా ఆడుతోన్న రాహుల్..

    కోహ్లీ, రాహుల్ మధ్య 50 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. 30 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. రాహుల్ హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు.

  • 11 Sep 2023 04:43 PM (IST)

    మొదలైన ఆట..

    ఎట్టకేలకు ఆట మొదలైంది. వాతావరణం అనుకూలించడంతో అంపైర్లు ఆటను కొనసాగిస్తున్నారు. దీంతో క్రీజులోకి రాహుల్, కోహ్లీ వచ్చారు.

  • 11 Sep 2023 04:34 PM (IST)

    10 నిమిషాల్లో ఆట మొదలు..

    పిచ్ ను పరిశీలించిన అంపైర్లు 10 నిమిషాల్లో ఆటకు రంగం సిద్ధం చేశారు. అయితే, ప్రస్తుతానికైతే ఓవర్లు ఏమాత్రం తగ్గించలేదు. 4.40గంటలకు టీమిండియా బ్యాటింగ్ మొదలుకానుంది.

  • 11 Sep 2023 04:23 PM (IST)

    10 నిమిషాల్లో కీలక ప్రకటన..

    కొలంబోలో వర్షం తగ్గింది. దీంతో పిచ్ ను సిద్ధం చేసే పనిలో సిబ్బంది బిజీగా ఉన్నారు. అలాగే ఆటగాళ్లు కూడా మైదానంలో తుది కసరత్తులు చేస్తున్నారు.

  • 11 Sep 2023 03:11 PM (IST)

    ఫలితం కోసం 20 ఓవర్ల మ్యాచ్?

    ప్రస్తుతం లంకలో వర్షం ఆగింది. అయితే, వాతావారణం మేఘావృతంగానే ఉంది. కవర్స్ అలాగే కప్పి ఉంచారు. సిబ్బంది నీటిని తొలగించే పనిలో పడ్డారు. అయితే, ఫలితం కోసం 20 ఓవర్ల గేమ్ నిర్వహించే ఛాన్స్ ఉందని అంటున్నారు.

  • 11 Sep 2023 02:32 PM (IST)

    ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. తాజా విజువల్స్ చూస్తే షాకే..

  • 11 Sep 2023 02:28 PM (IST)

    వాతావరణం అనుకూలిస్తే.. ఆగిన చోటనుంచే మ్యాచ్..

    ఆదివారం మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ 24.1 ఓవర్లలో 2 వికెట్లకు 147 పరుగులు చేసింది. నేడు ఇక్కడి నుంచే భారత్ బ్యాటింగ్ చేయనుంది.

  • 11 Sep 2023 02:26 PM (IST)

    రిజర్వ్ డే రోజున టీమ్ ఇండియా రికార్డు ఎలా ఉంది?

    రిజర్వ్ రోజున మ్యాచ్ ఆడడం భారత్‌కి ఇది 5వ సారి. దీనికి ముందు, నాలుగు సందర్భాలలో, రిజర్వ్ డేలో మిశ్రమ ప్రభావాలు కనిపించాయి. 1999 ప్రపంచకప్‌లో రిజర్వ్ డేలో ఆడిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 2002 ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో టైటిల్‌ను పంచుకోవాల్సి వచ్చింది. 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఇక 2021 WTC ఫైనల్‌లో కూడా రిజర్వ్ డే అంటే ఆరో రోజు జరిగింది. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టీమిండియాను ఓడించింది.

  • 11 Sep 2023 02:24 PM (IST)

    కొలంబోలో భారీ వర్షం..

    కొలంబో వాతావరణానికి సంబంధించి తాజా అప్‌డేట్ వచ్చింది. ఇది ఇప్పుడు ఉత్కంఠను కలిగిస్తోంది. ప్రస్తుతం అక్కడ వర్షాలు కురుస్తుండటంతో మైదానంలో కవర్లు ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు రిజర్వ్ డే రోజున కూడా భారత్-పాక్ మ్యాచ్ నిర్వహించే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

Published On - Sep 11,2023 2:22 PM