IND vs NZ: న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమైన టీమిండియా.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే..

IND vs NZ: శ్రీలంక తర్వాత ఇప్పుడు టీమిండియా న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇరుజట్ల మధ్య టీ20, వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ షెడ్యూల్, స్క్వాడ్, లైవ్ స్ట్రీమింగ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం..

IND vs NZ: న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమైన టీమిండియా.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే..
Ind Vs Nz
Follow us
Venkata Chari

|

Updated on: Jan 17, 2023 | 6:15 AM

ఈ సంవత్సరం భారత జట్టు శ్రీలంకతో తన మొదటి సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. ఇందులో టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు ఆడింది. టీ20ఐ సిరీస్‌ను 2-0, వన్డే సిరీస్‌ను 3-0తో గెలుచుకోవడం ద్వారా భారత జట్టు ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. ఇప్పుడు జట్టు జనవరి 18న బుధవారం నుంచి న్యూజిలాండ్ జట్టుతో తలపడేందుకు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య 3 వన్డేలు, 3 టీ20ఐ మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది.

ముందుగా వన్డే సిరీస్ కోసం ఇరు జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. దీని తర్వాత జనవరి 27న శుక్రవారం నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇక సిరీస్‌లోని చివరి మ్యాచ్‌ ఫిబ్రవరి 1న బుధవారం జరగనుంది. భారత కాలమానం ప్రకారం అన్ని వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి. అదే సమయంలో టీ20 మ్యాచ్‌లు రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి.

ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే?

వన్డే, టీ20 సిరీస్‌లు రెండూ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అయితే ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

సిరీస్ మొత్తం షెడ్యూల్ ఇలా..

తొలి వన్డే – జనవరి 18, బుధవారం – రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్.

రెండో వన్డే – జనవరి 21, శనివారం – షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం, రాయ్‌పూర్.

మూడో వన్డే – జనవరి 24, మంగళవారం – హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఇండోర్.

మొదటి టీ20 మ్యాచ్ – జనవరి 27, శుక్రవారం – JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్, రాంచీ.

రెండవ టీ20 మ్యాచ్ – జనవరి 29, ఆదివారం – భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో.

మూడో టీ20 మ్యాచ్ – ఫిబ్రవరి 01, బుధవారం – నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్.

వన్డే, టీ20లకు భారత జట్టు..

వన్డే జట్టు – రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, యుజువేంద్ర చాహల్ కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.

టీ 20 జట్టు – హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, పృథ్వీ షా, ముఖేష్ కుమార్.

వన్డే, టీ20 సిరీస్‌లకు న్యూజిలాండ్‌ జట్టు..

వన్డే జట్టు: టామ్ లాథమ్ (సి), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, ఇష్ సోధి.

టీ 20 జట్టు: మిచెల్ సాంట్నర్ (సి), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డేన్ క్లీవర్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, బెన్ లిస్టర్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ రిపన్, హెన్రీ సోధినర్, బిలా ఇర్షిక్ షిప్లీ.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..