AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Netherlands: సెమీస్‌ చేరాలంటే నెదర్లాండ్స్‌పై గెలుపు టీమిండియాకు చాలా కీలకం.. ఎందుకో తెలుసా?

పాకిస్థాన్‌పై అద్భుత విజయంతో టీమిండియాకు శుభారంభం లభించింది. అయితే ఆ విజయ పరంపరను కొనసాగించడం తప్పనిసరి. నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఏకపక్ష విజయంతో ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు టీమ్‌ఇండియాకు అత్యుత్తమ అవకాశం. ఎందుకంటే 3వ మ్యాచ్‌లో భారత్‌కి ప్రత్యర్థి దక్షిణాఫ్రికా.

India vs Netherlands: సెమీస్‌ చేరాలంటే నెదర్లాండ్స్‌పై గెలుపు టీమిండియాకు చాలా కీలకం.. ఎందుకో తెలుసా?
India Vs Netherlands
Basha Shek
|

Updated on: Oct 27, 2022 | 8:59 AM

Share

టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా భారత జట్టు గురువారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో నెదర్లాండ్స్ తో తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఉత్కంఠ విజయం సాధించిన టీమ్‌ఇండియాకు ఈ మ్యాచ్‌ కూడా చాలా కీలకం. ఎందుకంటే ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికాతో ఆడాల్సి ఉంది. అందువల్ల టీమ్ ఇండియా పాక్‌తో చేసిన పొరపాట్లన్నింటినీ ఈ మ్యాచ్‌లోనే సరిదిద్దుకోవడం తప్పనిసరి. ఇదే కాకుండా టీమ్ ఇండియాకు ఈ మ్యాచ్  కీలకం కావడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. పాకిస్థాన్‌పై అద్భుత విజయంతో టీమిండియాకు శుభారంభం లభించింది. అయితే ఆ విజయ పరంపరను కొనసాగించడం తప్పనిసరి. నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఏకపక్ష విజయంతో ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు టీమ్‌ఇండియాకు అత్యుత్తమ అవకాశం. ఎందుకంటే 3వ మ్యాచ్‌లో భారత్‌కి ప్రత్యర్థి దక్షిణాఫ్రికా. అందుకే ఈ మ్యాచ్ కు ముంందే తన తప్పులన్నీ సరిదిద్దుకోవాలి.

టాపార్డర్‌ రాణించేనా? ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో వరుణుడు చాలా మ్యాచ్‌లకు అడ్డుపడుతున్నాడు. ఇప్పటికే 2 మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, రద్దు చేయబడిన మ్యాచ్‌లలో రెండు జట్లూ 1 పాయింట్ మాత్రమే పొందుతాయి. ఒకవేళ వర్షం కారణంగా టీమ్ ఇండియా తదుపరి మ్యాచ్‌లు ఏదైనా రద్దైతే కష్టాలు తప్పకపోవచ్చు. అందువల్ల నెదర్లాండ్స్‌పై గెలిచి నెట్ రన్ రేట్ పెంచుకోవాలి. ఎందుకంటే వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దైతే..సెమీఫైనల్‌లోకి ప్రవేశించాలంటే చివరకు నెట్ రన్ రేట్ పెరగాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించడం టీమ్‌ఇండియాకు కీలకం. ముఖ్యంగా భారీ తేడాతో గెలవడం భారత్‌కు చాలా ముఖ్యం. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు రాణించారు. అయితే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు. కేవలం 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. అందువల్ల, నెదర్లాండ్స్‌పై టాప్ ఆర్డర్ ఆటగాళ్లు తిరిగి ఫామ్‌లోకి రావడం అత్యవసరం. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ త్వరగా ఫామ్‌లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

స్లాగ్‌ ఓవర్ల సమస్య.. పాకిస్థాన్‌పై టీమిండియా గెలిచి ఉండవచ్చు. కానీ బౌలింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని సెకండాఫ్‌లో భారత బౌలర్లు ఇచ్చిన పరుగులే నిదర్శనం. అంటే తొలి 10 ఓవర్లలో 60 పరుగులకే పరిమితమైన టీమిండియా బౌలర్లు 2వ 10 ఓవర్లలో 99 పరుగులు ఇచ్చారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో పరుగులు వదులుకోవడంతో పాక్ జట్టు భారీ స్కోర్ చేయగలిగింది. అందువల్ల డెత్ ఓవర్ల సమయంలో పరుగుల నియంత్రణ కూడా టీమ్ ఇండియాకు తప్పనిసరి. కాబట్టి ఈ తప్పులను సరిదిద్దుకోవడానికి నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌నే చివరి అవకాశం అని చెప్పొచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..