భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా రికార్డ్..
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న పొట్టి క్రికెట్ ప్రపంచ కప్‌లో రికార్డుల మోత మోగుతుంది. భారత్ - పాక్ మ్యాచ్ సందర్భంగా కింగ్ విరోచిత పోరాటంతో చరిత్ర సృష్టిస్తే..
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న పొట్టి క్రికెట్ ప్రపంచ కప్‌లో రికార్డుల మోత మోగుతుంది. భారత్ – పాక్ మ్యాచ్ సందర్భంగా కింగ్ విరోచిత పోరాటంతో చరిత్ర సృష్టిస్తే.. టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా భువీ రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా ఆక్టోబర్ 23న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహిన్ ఆఫ్రిదిని ఔట్ చేసిన భువీ.. తన 86వ టీ20 వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ అరుదైన ఘనతను భువీ తన పేరిట సొంతం చేసుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు 85 వికెట్లతో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో చాహల్ రికార్డును భువీ బ్రేక్ చేశాడు. ఇక అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాక్‌పై 4 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోహిత్ శర్మ వారసుడి అతడే.. కాబోయే కెప్టెన్‌పై వకార్ జోస్యం
సూపర్ స్టార్ మహేష్ బాబు నయా బిజినెస్ !! నవంబర్‌లో ప్రారంభం..
విడుదలకు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తోన్న దళపతి సినిమా !!
ఈసారి సూపర్‌స్టార్ మహేష్ ను ఢీకొట్టనున్న సంజయ్ దత్ !!
కాంతార సినిమా చూస్తూ థియేటర్ లోనే కన్నుమూసిన వ్యక్తి !!