IND vs BAN: వరుసగా రెండో విజయం.. సెమీస్ చేరిన రోహిత్ సేన.. చిత్తుగా ఓడిన బంగ్లా
India vs Bangladesh, 47th Match, Super 8 Group 1: శనివారం ఆంటిగ్వా మైదానంలో బంగ్లాదేశ్‌పై టీమిండియా 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. సూపర్-8 దశలో టీమిండియాకు ఇది రెండో విజయం. దీంతో ఆ జట్టు సెమీఫైనల్‌కు చేరువైంది.
India vs Bangladesh, 47th Match, Super 8 Group 1: ఆంటిగ్వాలో శనివారం జరిగిన సూపర్ 8 గ్రూప్ 1 టీ20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్‌లో భారత్ 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. దీంతో ఈ టోర్నమెంట్‌లో టీమిండియా అజేయంగా నిలిచింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లతో కూడిన గ్రూప్ 1లో భారతదేశం అగ్రస్థానానికి చేరుకుంది.
ఆదివారం ఉదయం ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించినట్లయితే, టోర్నమెంట్‌లో భారత్, ఆసీస్ సెమీఫైనల్‌లో తమ స్థానాలను బుక్ చేసుకుంటాయి.
భారత్ తదుపరి సోమవారం సెయింట్ లూసియాలో ఆస్ట్రేలియాతో ఆడుతుండగా, బార్బడోస్‌లో మంగళవారం జరిగే చివరి సూపర్ 8 గేమ్‌లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ తలపడతాయి.
T20 ప్రపంచ కప్ సూపర్ 8 గ్రూప్ 1 పాయింట్స్ టేబుల్..
జట్టు | ఆడింది | గెలిచింది | ఓడింది | పాయింట్లు | నెట్ రన్ రేట్ |
భారత్ | 2 | 2 | 0 | 4 | +2.425 |
ఆస్ట్రేలియా | 1 | 1 | 0 | 2 | +2.471 |
ఆఫ్ఘనిస్తాన్ | 1 | 0 | 1 | 0 | -2.350 |
బంగ్లాదేశ్ | 2 | 0 | 2 | 0 | -2.489 |
ఇరు జట్లు:
𝘼 𝙘𝙡𝙞𝙣𝙞𝙘𝙖𝙡 𝙨𝙝𝙤𝙬 𝙞𝙣 𝘼𝙣𝙩𝙞𝙜𝙪𝙖 𝙛𝙧𝙤𝙢 #𝙏𝙚𝙖𝙢𝙄𝙣𝙙𝙞𝙖! 👏 👏
A 5⃣0⃣-run win over Bangladesh for @ImRo45 & Co as they seal their 2️⃣nd win on the bounce in Super Eight. 🙌 🙌
Scorecard ▶️ https://t.co/QZIdeg3h22 #T20WorldCup | #INDvBAN pic.twitter.com/GJ4eZzDUaA
— BCCI (@BCCI) June 22, 2024
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): తాంజిద్ హసన్, లిట్టన్ దాస్(కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషాద్ హుస్సేన్, మహేదీ హసన్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..