IND Vs BAN: హాఫ్ సెంచరీతో హార్దిక్ తుఫాన్ ఇన్నింగ్స్.. బంగ్లా ముందు భారీ టార్గెట్..
India vs Bangladesh, 47th Match, Super 8 Group 1: టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తన రెండో సూపర్ 8 మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆంటిగ్వాలో ఆడుతోంది. బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. దీంతో బంగ్లా ముందు 197 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.
టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తన రెండో సూపర్ 8 మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆంటిగ్వాలో ఆడుతోంది. బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. దీంతో బంగ్లా ముందు 197 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.
టీమ్ ఇండియా టాప్-5 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 23 పరుగులు, విరాట్ కోహ్లీ 37, రిషబ్ పంత్ 36, సూర్యకుమార్ యాదవ్ 6, శివమ్ దూబే 34 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నారు. దూబేను రిషద్ హుస్సేన్ అవుట్ చేశాడు. హుస్సేన్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ చేసేందుకు ప్రయత్నించి పంత్ అవుటయ్యాడు.
అంతకుముందు టాంజిమ్ హసన్ సాకిబ్ 9వ ఓవర్లో కోహ్లీ, సూర్యలను పెవిలియన్‌కు పంపాడు. పవర్‌ప్లేలో భారత జట్టు 53 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (23 పరుగులు) షకీబ్ అల్ హసన్ కు బలయ్యాడు.
ఇరు జట్లు:
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): తాంజిద్ హసన్, లిట్టన్ దాస్(కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషాద్ హుస్సేన్, మహేదీ హసన్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..