World Cup 2023: అన్నీ మంచి శకునములే.. వరల్డ్ కప్ మనదేనంటున్న యావత్ భారత్
ఆసీస్.. సెమీస్‌లో దక్షిణాఫిక్రా గెలవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. సౌతాఫ్రికా బౌలర్లు కంగారులను ఓ లెవల్‌లో కంగారెత్తించారు. కానీ స్కోరు తక్కువగా ఉండడం..హెడ్ కాస్త దూకుడుగా ఆడి 67 రన్స్ చేయడంతో ఎట్టకేలకు లక్ష్యాన్ని చేధించింది ఆసీస్. గ్రాండ్ ఫినాలెలో ఆసిస్‌కు చుక్కలే.. టీం ఇండియా బ్యాటర్స్ మాంచి ఫామ్‌లో వున్నారు.
బిగ్ సండే.. బిగ్ ఫైట్. అహ్మదాబాద్‌లో ..ఆదివారం..ఆస్ట్రేలియాతో పోరులో జయం మనదే. 2023 వరల్డ్ కప్ గ్రాండ్ ఫినాలెకు సర్వసిద్ధమైంది. నరేంద్ర మోడీ స్టేడియం క్రికెట్ వెలుగులతో వెలిగిపోతోంది. యావత్ క్రికెట్ దునియా ఇప్పుడు గుజరాత్ వైపు చూస్తోంది. అదిగో అహ్మదాబాద్…కలర్‌ఫుల్‌గా అభిమానలోకానికి ఆహ్వానం పలుకుతోంది. అన్నీ మంచి శకునములే. అహ్మాదాబాద్‌లో అడుగుపెట్టగానే టీమ్ భారత్‌కు అపూర్వ స్వాగతం లభించింది. వీరులారా వందనం అంటూ మనోళ్లకు నుదట తిలకం దిద్దారు ఆడపడుచులు. తగ్గేదెలా… ఫైనల్ కప్ మనదే నంటూ యావత్ భారత్ ..రోహిత్ సేనను ఉత్సహా పరుస్తోంది. రికార్డుల రారాజు…కోహ్లీ మరోసారి విరాట స్వరూపం చూపడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. ఇక గేమ్ ఛేంజర్ శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు యూత్‌కు ఐకాన్‌గా మారాడు… ఆసీస్‌ను అయ్యర్ ఓ ఆటాడుకోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.
దాదాపు రెండు దశాబ్దాల తరువాత భారత్– ఆస్ట్రేలియా ప్రపంచ వాల్డ్ కప్ గ్రాండ్ ఫినెలాలో పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు 8 సార్లు వరల్డ్ కప్ ఫైనల్స్‌కు చేరుకున్న ఆసీస్..5 సార్లు విజేతగా నిలిచింది. టీమ్ భారత్..ముచ్చటగా మూడోసారి ప్రపంచ్ కప్‌ను ముద్దాడే సమయం ఆసన్నమైంది. ఇక కంగారులతో కతర్నాక్ రణమే. రోహిత్ సేనతో మాంఛి ఫామ్‌లో వుంది. డిఫెనెట్‌గా టీం భారత్ హాట్ ఫేవరేట్. ఇప్పుడు అందరి నోటా ఇదే మాట.
భారత్‌లో 2023 వరల్డ్ కప్ ఫైనల్.. దునియా బర్ క్రికెట్ ఫీవర్. కుర్రాళ్లు కసి మీదున్నారు.. వరుస విజయాలతో జోష్ మీదున్నారు… రోహిత్ అండ్ టీమ్ వాల్డ్‌కప్‌ను ముద్దాడడం ఖాయం… ఆ విజయదృశ్యాన్ని చాటి చెప్పడం కోసం అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం సంసిద్దమైంది. వాల్డ్ కప్ 2023..గ్రాండ్ ఫినాలె ఆరంభ వేడుకలో సంబరాలు అంబరాన్నంటనున్నాయి. సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఆధ్వర్యంలో ఆకాశవీధిలో భారతీయం …జిగేల్మననుంది. 9 ఎయిర్ క్రాఫ్ట్‌ల గగన విన్యాసాల గురించి చెప్పతరమా… చూసి తరించాల్సిందే ఇక.
ఆసీస్.. సెమీస్‌లో దక్షిణాఫిక్రా గెలవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. సౌతాఫ్రికా బౌలర్లు కంగారులను ఓ లెవల్‌లో కంగారెత్తించారు. కానీ స్కోరు తక్కువగా ఉండడం..హెడ్ కాస్త దూకుడుగా ఆడి 67 రన్స్ చేయడంతో ఎట్టకేలకు లక్ష్యాన్ని చేధించింది ఆసీస్. గ్రాండ్ ఫినాలెలో ఆసిస్‌కు చుక్కలే.. టీం ఇండియా బ్యాటర్స్ మాంచి ఫామ్‌లో వున్నారు. షమీతో మరింత పదునెక్కి వున్నాడు. మనోడు అదే స్పీడ్ కంటిన్యూ చేస్తే కంగారుల వికెట్లకు ఇక ఊచకోతే. 2023 వరల్డ్ కప్ గ్రాండ్ ఫినాలేకు కౌంట్ డౌన్ మొదలైంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో సూపర్ సే ఊపర్ అనేలా అద్వితీయ ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ భారత్ వర్సెస్ ఆసీస్ గ్రాండ్ ఫినాలకు హాజరవుతారు.
జయం మనదేనని ఫ్యాన్స్ ఫిక్సయ్యారు.అటు మ్యాచ్ ఏకపక్షంగా ఉండొచ్చన్న ఆసీస్ కెప్టెన్ కెమిన్స్ కామెంట్స్ వైరలవుతున్నాయి. హోమ్‌టౌన్‌లో టీం ఇండియాకు ఎలాగూ ఎంకరేజ్‌మెంట్ వుంటుంది. ఎట్ ది సైమ్ టైమ్ ఒత్తిడి కూడా ఎక్కువ. ఐతే బలాబలాలను పోలిస్తే వరల్డ్ కప్‌లో రాణించే సత్తా టీమ్ ఇండియాకే ఎక్కువగా ఉందనేది క్రికెట్ విశ్లేషకుల మాట. ఆసిస్ కెప్టెన్ కెమిన్స్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సో. ఇక జయం మనదే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయడి