Sachin – Vinod: సచిన్, వినోద్ కాంబ్లీల ఫ్రెండ్‌షిప్‌పై గౌతమ్ మీనన్ సినిమా.. అప్డేట్.
లవ్, సెంటిమెంట్, యాక్షన్, కమర్షియల్ ఏ సినిమా అయినా ప్రేక్షకులు ఇట్టే ఆకట్టుకునేవిధంగా తెరకెక్కించడం గౌతమ్ మీనన్ ప్రత్యేకత. కోలీవుడ్‌లో మిన్నలే మూవీతో ఇండస్ట్రీలో ఎంట్రీఇచ్చిన ఆయన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నారు. తాజాగా విక్రమ్ కథానాయకుడిగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ధ్రువనక్షత్రం చిత్రం అనేక ఆటంకాలను ఎదుర్కొని ఎట్టకేలకు ఈనెల 24వ తేదీన విడుదల కానుంది.
లవ్, సెంటిమెంట్, యాక్షన్, కమర్షియల్ ఏ సినిమా అయినా ప్రేక్షకులు ఇట్టే ఆకట్టుకునేవిధంగా తెరకెక్కించడం గౌతమ్ మీనన్ ప్రత్యేకత. కోలీవుడ్‌లో మిన్నలే మూవీతో ఇండస్ట్రీలో ఎంట్రీఇచ్చిన ఆయన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నారు. తాజాగా విక్రమ్ కథానాయకుడిగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ధ్రువనక్షత్రం చిత్రం అనేక ఆటంకాలను ఎదుర్కొని ఎట్టకేలకు ఈనెల 24వ తేదీన విడుదల కానుంది. ఇక బుధవారం ఇండియా, న్యూజిలాండ్ మధ్య సాగిన ప్రపంచ క్రికెట్ కప్ సెమీఫైనల్స్ పోటీని విశ్లేషించే విధంగా ఒక టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో గౌతమ్ మీనన్ పాల్గొన్నారు. నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ అడిగిన పలు ప్రశ్నలకు గౌతమ్‌మీనన్ బదులిచ్చారు. ఇందులో భాగంగా క్రికెట్ నేపథ్యంలో చిత్రం చేస్తారా..? అంటూ ఆర్జే బాలాజీ, గౌతమ్ మీనన్‌ను అడిగారు. అందుకు ఆయన ఆల్రెడీ ఆ ప్రయత్నంలోనే ఉన్నానని, కథ కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లేల మధ్య స్నేహం ఇతివృత్తంగా ఈ చిత్ర కథ ఉంటుందన్నారు. వారు క్రికెట్ క్రీడాకారులుగా జిల్లా స్థాయి నుంచి జాతీయస్థాయికి ఎలా చేరుకున్నారు అనే పలు ఆసక్తికరమైన అంశాలతో కథ సాగుతుందని తెలిపారు. కాగా, ఈ చిత్రంలో ఆయా పాత్రల్లో నటించే హీరోలు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.