AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy 2025: ఎవరెంత ట్రై చేసిన ఫైనల్ కి వెళ్ళేది వారే! ఆస్ట్రేలియన్ ఉరుముల దొర బోల్డ్ ప్రిడిక్షన్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫైనల్ పోరుకు భారత్, ఆస్ట్రేలియా జట్లు ముందున్నాయని మాజీ ఆల్‌రౌండర్ డేనియల్ క్రిస్టియన్ అభిప్రాయపడ్డాడు. ఆసీస్ జట్టు ఐసీసీ టోర్నమెంట్లలో అద్భుత ప్రదర్శన చేస్తుందని, యువ బ్యాటర్లు, బౌలింగ్ విభాగం మెరుగుపడుతున్నాయని తెలిపాడు. భారత జట్టు కూడా బలమైన జాగ్రత్తలతో ఆడుతుండటంతో, ఫైనల్ పోరు ఆసక్తికరంగా మారనుందని అన్నాడు. అయితే, సెమీ ఫైనల్ దశ తర్వాతే ఖచ్చితమైన ఫలితం తెలుస్తుందని సూచించాడు.

Champions Trophy 2025: ఎవరెంత ట్రై చేసిన ఫైనల్ కి వెళ్ళేది వారే! ఆస్ట్రేలియన్ ఉరుముల దొర బోల్డ్ ప్రిడిక్షన్
Dan Christian (1)
Narsimha
|

Updated on: Feb 26, 2025 | 3:40 PM

Share

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో జట్లు అద్భుత ప్రదర్శన కనబరిచుతున్నాయి. ఇప్పటికే గ్రూప్-ఏ నుంచి రెండు జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఇదిలా ఉండగా, ఫైనల్‌లో తలపడే జట్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ డేనియల్ క్రిస్టియన్.

డేనియల్ క్రిస్టియన్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తోందని అన్నాడు. ఇటీవల శ్రీలంక, పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌ల్లో అంతగా రాణించకపోయినా, ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రం ఆసీస్ ఆటగాళ్లు తమ ఉత్తమ ప్రతిభను చూపుతారని అన్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జోస్ ఇంగ్లీష్, అలెక్స్ కేరీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుతంగా ఆడారని, బౌలింగ్ విభాగంలో కూడా మంచి ప్రదర్శన కనబర్చారని తెలిపారు.

హేజిల్‌వుడ్, కమ్మిన్స్, స్టార్క్ లాంటి కీలక బౌలర్లు లేకున్నా, ఆసీస్ బౌలర్లు 350 పరుగులు ఇచ్చారని.. ఈ విధంగా బౌలింగ్ కొనసాగితే ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని క్రిస్టియన్ అభిప్రాయపడ్డాడు. అయితే బ్యాటింగ్ విభాగంలో యువ ఆటగాళ్లు అద్భుతమైన షాట్లు ఆడుతున్నారని, మిడిలార్డర్ మెరుగుపడుతున్నందున జట్టు మరింత బలంగా మారుతోందని అన్నాడు.

ఈ నేపథ్యంలో ఫైనల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్యే పోటీ నెలకొనవచ్చని క్రిస్టియన్ అభిప్రాయపడ్డాడు. ఆసీస్ జట్టు నెమ్మదిగా తన రిథమ్‌ను అందుకుంటోందని, ఒత్తిడిని జయిస్తూ ముందుకు సాగుతున్నదని చెప్పాడు. అయితే లీగ్ దశలో దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీనివల్ల ఇరు జట్లకు చెరో పాయింట్ లభించగా, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్ కీలకంగా మారిందని పేర్కొన్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌ను చిన్న జట్టుగా తీసుకోవడం పొరపాటేనని క్రిస్టియన్ హెచ్చరించాడు. గతంలో ఎన్నో జట్లను షాక్‌కు గురి చేసిన ఆఫ్ఘన్ జట్టు, తమ ఆటతో ప్రపంచ క్రికెట్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుందని చెప్పాడు. కాబట్టి ఆసీస్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌ను తేలికగా తీసుకోకుండా పూర్తిగా గట్టిగా ఆడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.

ఇదే సమయంలో భారత జట్టును కూడా ఫైనల్‌కు ప్రధానంగా లెక్కలోకి తీసుకోవాలని క్రిస్టియన్ చెప్పాడు. కోహ్లీ, రోహిత్, శుభ్‌మన్ గిల్ వంటి బ్యాటర్లు అద్భుత ఫామ్‌లో ఉండగా, షమీ, హార్దిక్, కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్లు ప్రత్యర్థులకు సవాలు విసురుతున్నారు. సెమీ ఫైనల్ దశ పూర్తైన తర్వాత మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధించే జట్లు ఖరారవుతాయని, అయితే ప్రస్తుత ప్రదర్శనను బట్టి చూస్తే భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ పోరుకు రంగం సిద్ధమవుతోందని అభిప్రాయపడ్డాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..