IND vs AUS: తొలి టెస్టులో కేఎల్ రాహుల్‌కు భారీ షాక్.. టీమిండియా కీపర్‌గా తెలుగబ్బాయే.. అరంగేట్రానికి రంగం సిద్ధం?

Border-Gavaskar Trophy: ఆస్ట్రేలియాతో 4 మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌లో జరుగుతుంది. కాగా, ఈ మ్యచ్‌లో వికెట్ కీపర్ కేఎస్ భరత్ అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశాన్ని పొందే ఛాన్స్ ఉంది.

IND vs AUS: తొలి టెస్టులో కేఎల్ రాహుల్‌కు భారీ షాక్.. టీమిండియా కీపర్‌గా తెలుగబ్బాయే.. అరంగేట్రానికి రంగం సిద్ధం?
Indian Cricket Team
Follow us

|

Updated on: Feb 06, 2023 | 5:18 PM

IND vs AUS: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9 నుంచి 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇరు జట్లు తమ సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. భారత జట్టు మ్యాచ్ విన్నర్ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఈ టెస్టు సిరీస్‌లో ఆడడం లేదు. ఇటువంటి పరిస్థితిలో దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన కేఎస్ భరత్‌ను మొదటి టెస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11లో చేర్చవచ్చిని తెలుస్తోంది.

డిసెంబర్ 2022లో జరిగిన కారు ప్రమాదంలో రిషబ్ పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా అతను ప్రస్తుతం చాలా కాలం పాటు క్రికెట్‌కే కాదు టీమిండియాకు దూరంగా ఉండాల్సి వస్తోంది. మరోవైపు కేఎస్ భరత్ గురించి మాట్లాడితే, అతను భారత టెస్ట్ జట్టులో ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉన్నాడు. కానీ, అతనికి ఇంతవరకు అరంగేట్రం చేసే అవకాశం రాలేదు.

తొలి టెస్టులో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్‌కు నో ఛాన్స్..

ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగిస్తారని ఇప్పటి వరకు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే రాహుల్ ఫిట్‌నెస్‌ను పరిగణనలోకి తీసుకుంటే అతనికి ఈ బాధ్యత ఇవ్వడం జట్టుకు పెద్ద ముప్పుగా పరిణమిస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

గత ఏడాది కాలంలో కేఎల్ రాహుల్ చాలాసార్లు గాయపడ్డాడు. ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌కి ఇచ్చిన ప్రకటనలో బీసీసీఐ వర్గాలు కూడా ఇదే విషయాన్ని ప్రకటించాయి. ఇలాంటి పరిస్థితుల్లో అతడిని టెస్టు క్రికెట్‌లో వికెట్‌కీపర్‌ పాత్ర పోషించడం సరైన నిర్ణయం కాదని తెలుస్తోంది. టెస్ట్ ఫార్మాట్‌లో స్పెషలిస్ట్ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ అవసరం. ప్రస్తుతం భరత్, ఇషాన్ ఇద్దరు వికెట్ కీపర్లుగా జట్టులో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరికి అవకాశం ఇవ్వాలనేది టీం మేనేజ్‌మెంట్ నిర్ణయించాల్సి ఉంది. ఇషాన్ కిషన్ కూడా ప్రస్తుతం ఫాంతో తంటాలు పడుతున్నాడు. ఈ క్రమంలో కేఎస్ భరత్‌కు ఆస్ట్రేలియా సిరీస్‌తో అరంగేంట్రం చేసే ఛాన్స్ దక్కవచ్చని తెలుస్తోంది.

కేఎస్ భరత్ ఫస్ట్-క్లాస్ కెరీర్..

కేఎస్ భరత్ కెరీర్‌లో ఇప్పటివరకు దేశవాళీ క్రికెట్‌లో గొప్ప రికార్డు ఉంది. ఆంధ్రా తరపున ఆడుతున్న ఈ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ ఇప్పటివరకు 86 మ్యాచ్‌లలో 135 ఇన్నింగ్స్‌లలో 37.95 సగటుతో 4707 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్‌ నుంచి ఇప్పటివరకు 9 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు వచ్చాయి. అదే సమయంలో, భరత్ ఇప్పటి వరకు IPLలో 10 మ్యాచ్‌లు ఆడాడు. అక్కడ అతను 28.43 సగటుతో మొత్తం 199 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..