IND vs AUS: ‘అతనో ఫిరంగి.. మైదానంలో మమ్మల్ని కాల్చేస్తాడు’: భారత బౌలర్‌పై ఆసీస్ స్టార్ ప్లేయర్ మైండ్‌గేమ్ షురూ..

ఫిబ్రవరి 9 నుంచి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభానికి ముందే భారత ఆటగాళ్లపై మైండ్ గేమ్ మొదలుపెట్టేసింది.

IND vs AUS: 'అతనో ఫిరంగి.. మైదానంలో మమ్మల్ని కాల్చేస్తాడు': భారత బౌలర్‌పై ఆసీస్ స్టార్ ప్లేయర్ మైండ్‌గేమ్ షురూ..
India Vs Australia 1st Test
Follow us

|

Updated on: Feb 06, 2023 | 5:45 PM

గత ఏడాది తన బ్యాట్‌తో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజా.. భారత్‌తో జరిగే టెస్టు సిరీస్ తమ జట్టుకు కఠినమైన సవాల్ అని అభిప్రాయపడ్డాడు. భారత స్పిన్నర్లను పెద్ద సవాల్‌గా అభివర్ణించాడు. ఉస్మాన్ ముఖ్యంగా ఆర్ అశ్విన్‌ ఆస్ట్రేలియా పాలిట విలన్‌లా మారతాడని చెప్పుకొచ్చాడు. ఆర్‌ అశ్విన్‌ మాకు పెద్ద ముప్పుగా పరిణమిస్తాడని, అతడు ఓ ఫిరంగి అంటూ సిరీస్ ప్రారంభానికి ముందే కవ్వింపులు మొదలుపెట్టాడు. పాకిస్తాన్‌లో జన్మించిన ఖవాజా వీసా పొందడంలో జాప్యం కారణంగా జట్టుతో కాకుండా ఆలస్యంగా భారతదేశానికి చేరుకున్నాడు. డేవిడ్ వార్నర్‌తో కలిసి ఉస్మాన్ ఖవాజా ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు.

గత దశాబ్దంలో టెస్ట్ క్రికెట్‌లో రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం ముఖ్యంగా భారతదేశంలో అంత తేలికైన పని కాదు. హోం గ్రౌండ్స్‌లో అశ్విన్ రికార్డు గురించి మాట్లాడితే, అతను భారతదేశంలో 51 టెస్ట్ మ్యాచ్‌లలో 21.16 సగటుతో 312 వికెట్లు పడగొట్టాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ఖవాజా భారత్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాడు. అయితే ఇప్పుడు అతనికి టెస్టు ఆడే అవకాశం లభించింది. అతను 2013, 2017 టెస్టు జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియా టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికైన ఖవాజాపైనే ఆస్ట్రేలియా ఆటతీరు ఆధారపడి ఉంటుంది. 2004-05 తర్వాత భారత్‌లో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ను గెలవలేదు. ఈ మేరకు ఖవాజా మాట్లాడుతూ, ‘ఇది భిన్నమైన అనుభూతి. ఈ గేమ్‌లో ఎలాంటి హామీలు లేవు. కానీ, బ్యాటింగ్, బౌలింగ్‌లో మరింత పరిపక్వత ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

 భారత పర్యటన చాలా కష్టం – ఉస్మాన్

ఉస్మాన్ ఖవాజా సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో మాట్లాడుతూ, ‘గత పదేళ్లలో మేం చాలా నేర్చుకున్నాం. మునుపటి కంటే మెరుగైన స్థితిలో ఉన్నాం. కానీ, సిరీస్ చాలా కఠినంగా ఉంటుంది. టెస్టు సిరీస్‌కు ముందు వార్మప్ మ్యాచ్ ఆడకూడదని ఆస్ట్రేలియా నిర్ణయించుకుంది. బదులుగా బెంగళూరు సమీపంలోని స్పిన్నర్‌కు అనుకూలమైన పిచ్‌లపై ప్రాక్టీస్ చేయడం మంచిది. అశ్విన్‌ను అతిపెద్ద ముప్పుగా చూస్తున్నాం. అతనిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటానికి అలాంటి బౌలర్ల సహాయం తీసుకుంటున్నాం’ అని తెలిపాడు.

అశ్విన్‌ ఓ ఫిరంగి..

ఖవాజా మాట్లాడుతూ, ‘ అశ్విన్ ఒక ఫిరంగి. అతనిలో చాలా నైపుణ్యం ఉంది. ఎన్నో వెరైటీలను కలిగి ఉన్నాడు. అతడిని ఎదుర్కోవడం సవాల్‌గా ఉంటుంది. మూడో లేదా నాల్గవ రోజు వికెట్ తిరుగుతుంది. అతను చాలా ఓవర్లు బౌల్ చేస్తాడు. మరి అతని ముందు ఎలా పరుగులు చేస్తామో చూడాలి. వికెట్ బాగుంటే కొత్త బంతిని ఆడడం చాలా తేలికవుతుందని, అయితే పిచ్ పగిలిపోయినప్పుడు స్పిన్నర్లు కొత్త బంతిని హ్యాండిల్ చేస్తుంటే భారత్‌లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారుతుందని’ అన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు
17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..
17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..
బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం
బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం
ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా
ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా
కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..
కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..
చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్
చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్
మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్
మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్
అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
నేటితో ప్రచారానికి తెర.. ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్దమైన నేతలు
నేటితో ప్రచారానికి తెర.. ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్దమైన నేతలు
ఆ రాష్ట్రంలో ఆలయాల్లో కరివేరు పువ్వులవాడడంపై నిషేధం రీజన్ ఏమిటంటే
ఆ రాష్ట్రంలో ఆలయాల్లో కరివేరు పువ్వులవాడడంపై నిషేధం రీజన్ ఏమిటంటే
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!