Video: 44 పరుగులకే 3 వికెట్లు డౌన్.. ఓటమికి చేరువైన టీం.. కట్‌చేస్తే.. 7 సిక్సర్లు, 9 ఫోర్లతో 122 పరుగులు.. రిజల్ట్‌లో ట్విస్ట్..

ఇంటర్నేషనల్ లీగ్ T20లో ఎంఐ ఎమిరేట్స్ దుబాయ్ క్యాపిటల్స్‌తో 7 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దాసున్ షనక, సికందర్ రజాల సెంచరీ భాగస్వామ్యంతో అంచనాలు తలకిందులయ్యాయి.

Video: 44 పరుగులకే 3 వికెట్లు డౌన్.. ఓటమికి చేరువైన టీం.. కట్‌చేస్తే.. 7 సిక్సర్లు, 9 ఫోర్లతో 122 పరుగులు.. రిజల్ట్‌లో ట్విస్ట్..
Ilt20i
Follow us

|

Updated on: Feb 06, 2023 | 4:38 PM

అంతర్జాతీయ టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ మెరుగైన ర్యాంక్‌లో ఉన్న ఎంఐ ఎమిరేట్స్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ 20 ఓవర్లలో 164 పరుగులు చేయగా, సమాధానంగా దుబాయ్ క్యాపిటల్స్ జట్టు 11 బంతులు ఉండగానే ఈ లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి సాధించింది. దుబాయ్ క్యాపిటల్స్‌కు చెందిన ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు ఎంఐ ఎమిరేట్స్‌ బౌలర్లను చితక్కొట్టారు. దసున్ షనక, సికందర్ రజా తుఫాన్ హాఫ్ సెంచరీలతో దుబాయ్ క్యాపిటల్స్‌కు విజయాన్ని అందించారు. దుబాయ్‌కి చెందిన ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ సెంచరీ భాగస్వామ్యంతో తమ జట్టును గెలిపించారు.

లక్ష్యాన్ని ఛేదించిన దుబాయ్ తర్వగానే 3 వికెట్లను కోల్పోయింది. ఆ సమయంలో జట్టు స్కోర్ కేవలం 44 పరుగులే. ఎంఐ ఎమిరేట్స్ విజయం పక్కా అనుకున్న సమయంలో.. షనక, రజా అద్భుతాలు చేశారు. వీరిద్దరూ వేగంగా బ్యాటింగ్ చేస్తూ 7 సిక్సర్లు, 9 ఫోర్లు కొట్టారు. వీరిద్దరి మధ్య 70 బంతుల్లో అజేయంగా 122 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.

ఇవి కూడా చదవండి

యూసుఫ్ పఠాన్ టెక్నిక్..

ఈ మ్యాచ్ నుంచి యూసుఫ్ పఠాన్ దుబాయ్ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న షనకను యూసుఫ్ మూడో నంబర్‌లో పంపించాడు. ఈ ఆటగాడు సారథి ఆశలను నిరాశపరచలేదు. షనక అజేయ అర్ధ సెంచరీతో చెలరేగాడు. రోవ్‌మన్ పావెల్ జీరోకే పెవిలియన్ చేరిన తర్వాత, అతను సికందర్ రజాతో కలిసి అద్భుతమైన సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

అంతకుముందు బౌలింగ్‌లో జేక్ బాల్ 3 వికెట్లు, జంపా 2 వికెట్లు తీశారు. రజా కూడా బౌలింగ్‌లో సత్తా చాటుతూ 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. షనకకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఐఎల్ టీ20 పాయింట్ల పట్టిక..

ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌ పాయింట్ల పట్టికలో గల్ఫ్ జెయింట్స్ నంబర్ 1 స్థానంలో ఉంది. 9 మ్యాచ్‌ల్లో 6 గెలిచింది. డెసర్ట్ వైపర్స్ 10 మ్యాచ్‌లలో 7 గెలిచింది. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు ఓడిపోయినా 10 మ్యాచ్‌ల్లో 5 గెలిచి మూడో స్థానంలో నిలిచింది. ఈ విజయంతో దుబాయ్ జట్టు 8 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..