AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SL vs IND 2nd Test: ఒకరిద్దరు కాదు.. ఏకంగా నలుగురిపై వేటు.. 2వ టెస్ట్ కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..!

SL vs IND 2nd Test: శ్రీలంకతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో టీమ్ ఇండియా 1-0 ఆధిక్యం సాధించి జోరుమీదుంది. గాలేలో 165 పరుగుల భారీ విజయం నమోదు చేసిన ఉత్సాహంతో భారత్ రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. సిరీస్ క్లీన్‌స్వీప్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అదే జట్టును బరిలోకి దించే సూచనలు కనిపిస్తున్నాయి.

SL vs IND 2nd Test: ఒకరిద్దరు కాదు.. ఏకంగా నలుగురిపై వేటు.. 2వ టెస్ట్ కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..!
Ind Sv Sl 2nd Test
Venkata Chari
|

Updated on: Aug 20, 2026 | 4:05 PM

Share

SL vs IND 2nd Test: కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో భారత తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు. గాలే టెస్టులో భారత ఆటగాళ్లు సమష్టిగా రాణించి విజయాన్ని అందించడంతో టీమ్ మేనేజ్‌మెంట్ విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగించాలని భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు మరో అవకాశం దక్కనుంది. అలాగే మిడిలార్డర్‌లో కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ తమ స్థానాలను నిలబెట్టుకునే అవకాశం ఉంది. మ్యాచ్ డ్రా అయినా సిరీస్ భారత్ సొంతమవుతుంది కాబట్టి అదే జట్టుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

బెంచ్‌కే పరిమితం కానున్న నలుగురు ఆటగాళ్లు..

విన్నింగ్ టీమ్‌ను యథాతథంగా కొనసాగిస్తే జట్టులోని నలుగురు కీలక ఆటగాళ్లు రెండో టెస్టులోనూ రిజర్వ్‌గా మిగిలిపోనున్నారు. బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్, పేసర్లు ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్ మరోసారి బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. జట్టులోని ప్రధాన ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటంతో వీరికి తుది జట్టులో అవకాశం దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..?

ఇవి కూడా చదవండి

బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ల జోరు..

తొలి టెస్టులో అరంగేట్రం చేసి అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ స్పిన్నర్ మానవ్ సుతార్, సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తమ స్పిన్ మ్యాజిక్‌తో శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేశారు. పేస్ విభాగంలో మహ్మద్ సిరాజ్ తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ వేగంతో రాణించనున్నారు.

భారత తుది జట్టు (అంచనా):

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

ఎక్కువమంది చదివినది: SL vs IND: 7 ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ.. వేటుకు సిద్ధమైన గంభీర్?

ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా సిరీస్ క్లీన్‌స్వీప్ చేయడంతో పాటు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లాలని భారత్ భావిస్తోంది. మరోవైపు సిరీస్ సమం చేయడానికి ఆతిథ్య శ్రీలంక సర్వశక్తులూ ఒడ్డాల్సి ఉంటుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us