IND vs ZIM: చరిత్ర సృష్టించిన జింబాబ్వే.. వరుసగా మూడు సిరీస్‌లు కైవసం.. టీమిండియాకు డేంజర్ బెల్స్..
భారత జట్టు ఈ వారం జింబాబ్వే పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో జింబాబ్వేతో టీమ్ ఇండియా మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌లు ఆగస్టు 18, 20, 22 తేదీల్లో జరగనున్నాయి.
భారత క్రికెట్ జట్టు త్వరలో జింబాబ్వేలో పర్యటించనుంది. అక్కడ రెండు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. అయితే, ప్రస్తుతం జింబాబ్వే ఉన్న ఫాంతో ఈ సిరీస్ అంత ఈజీగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. భారత్‌తో సిరీస్‌కు ముందు, జింబాబ్వే తమ ఆట నుంచి కఠినమైన వైఖరిని కనబరిచింది. దీంతో టీమ్ ఇండియాకు ప్రమాద ఘంటికలు మోగించింది. భారత జట్టు తమను తక్కువగా అంచనా వేస్తే, అది భారీ తప్పే అవనుందని జింబాబ్వే సత్తా చాటే అవకాశం ఉంది.
తొలిసారిగా వరుసగా మూడు సిరీస్‌లు గెలిచిన జింబాబ్వే ..
వాస్తవానికి, జింబాబ్వే ఇటీవల వరుసగా మూడు పెద్ద సిరీస్‌లను గెలుచుకుంది. ఇందులో రెండు టీ20లు, ఒక వన్డే సిరీస్‌లు ఉన్నాయి. ఈ విధంగా జింబాబ్వే అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి వరుసగా మూడు సిరీస్‌లు చరిత్ర సృష్టించింది. ఇది ఆ టీం రికార్డులలో ఒకటిగా నిలిచింది. ఈ సమయంలో జింబాబ్వే టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ సిరీస్‌ను గెలుచుకుంది. అదే సమయంలో టీ20 తర్వాత వన్డే సిరీస్‌లోనూ బంగ్లాదేశ్ ఓటమిపాలైంది.
ఈ మూడు సిరీస్‌లలో జింబాబ్వే స్టార్ ఆల్‌రౌండర్ సికందర్ రజా హీరోగా నిలిచాడు. T20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ ఫైనల్‌లో నెదర్లాండ్స్‌పై 8 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
దీని తర్వాత, బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు సిరీస్‌లలో 36 ఏళ్ల సికందర్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో 2 వికెట్లు తీయడంతో పాటు 127 పరుగులు చేశాడు. వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన అతను 5 వికెట్లు పడగొట్టి 252 పరుగులు చేశాడు.
వరుసగా మూడు అంతర్జాతీయ సిరీస్‌లు..
T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ –
బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి T20 సిరీస్‌లో నెదర్లాండ్స్‌ను 37 పరుగుల తేడాతో ఓడించింది.
బంగ్లాదేశ్‌పై 2-1 తేడాతో ODI సిరీస్‌ను గెలుచుకుంది.
భారత్-జింబాబ్వే వన్డే సిరీస్ షెడ్యూల్
ఈ నెలలో భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఇక్కడ కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో జింబాబ్వేతో టీమ్ ఇండియా మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు జింబాబ్వే రాజధాని హరారేలో జరగనున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లు ఆగస్టు 18, 20, 22 తేదీల్లో జరగనున్నాయి.