IND vs ZIM: జింబాబ్వే టూర్.. టీమిండియాలో భారీ మార్పులు.. మరో ముగ్గురిని ఎంపిక చేసిన బీసీసీఐ

భారత్ వర్సెస్ జింబాబ్వే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జూలై 6 నుంచి ప్రారంభం కానుంది. జూలై 14 వరకు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ టీమ్‌ఇండియాకు నాయకత్వం వహించనున్నాడు. ఈ సిరీస్‌ కోసం ఇప్పటికే టీమిండియాను కూడా ప్రకటించారు.

IND vs ZIM: జింబాబ్వే టూర్.. టీమిండియాలో భారీ మార్పులు.. మరో ముగ్గురిని ఎంపిక చేసిన బీసీసీఐ
IND vs ZIM
Follow us

|

Updated on: Jul 02, 2024 | 4:17 PM

భారత్ వర్సెస్ జింబాబ్వే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జూలై 6 నుంచి ప్రారంభం కానుంది. జూలై 14 వరకు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ టీమ్‌ఇండియాకు నాయకత్వం వహించనున్నాడు. ఈ సిరీస్‌ కోసం ఇప్పటికే టీమిండియాను కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు తొలి రెండు మ్యాచ్‌లకు కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు. సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలకు తొలి రెండు టీ20లకు జట్టులో చోటు కల్పించారు. సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్‌ ల స్థానంలో వీరు స్థానం దక్కించుకున్నారు. ఈ ముగ్గురూ T20 ప్రపంచకప్ జట్టులోని ఆటగాళ్లు. మొదటి రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి తీసుకున్నారు. బార్బడోస్ నుంచి భారత జట్టు ఇంకా భారత్‌కు తిరిగిరాలేదు. భారీ ఈదురుగాలులు, తుపాన్‌ కారణంగా విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో వారు స్వదేశానికి రావడానికి ఇంకా సమయం పడుతుంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ ఈ ముగ్గురి స్థానంలో సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలను తొలి రెండు మ్యాచ్‌లకు ఎంపిక చేసింది.

జింబాబ్వేతో మొదటి మ్యాచ్ జూలై 6న, రెండో మ్యాచ్ జూలై 7న జరగనుంది. ఆ తర్వాత మూడో మ్యాచ్ జూలై 10న జరగనుంది. సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే మూడో మ్యాచ్‌కు ముందే హరారే చేరుకుంటారని బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది. సాయి సుదర్శన్, హర్షిత్ రాణా ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేశారు. ఈ ముగ్గురిని ఒకే ప్రాతిపదికన ఎంపిక చేశారు. మరోవైపు రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ కూడా ప్రపంచకప్ విజేత జట్టుతో ఉన్నారు. ఇద్దరూ రిజర్వ్ ప్లేయర్లుగా టీమ్ ఇండియాతో ఉన్నారు. కానీ ప్లేయింగ్ ఎలెవన్ లో వీరికి చోటు దక్కలేదు.

ఇవి కూడా చదవండి

జింబాబ్వే సిరీస్‌కు భారత టీ20 జట్టు:

తొలి రెండు మ్యాచ్‌లు:

శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), ర్యాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్ పాండే, హర్షిత్ రాణా.

చివరి మూడు మ్యాచ్‌ల కోసం:

శుభమన్ గిల్ (కెప్టెన్), యస్సవి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), ర్యాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్ పాండే, శివమ్ దూబే.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..