Hardik Pandya: ‘ఇలాంటి భార్య ఎవరికీ ఉండకూడదు’.. హార్దిక్ సతీమణి నటాషాపై అభిమానుల ఆగ్రహం.. కారణమిదే

కప్ గెలిచిన అనంతరం గ్రౌండ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు హార్దిక్. గత కొన్నినెలలుగా తాను పడుతోన్న మానసిక వేదన గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. అయితే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హార్దిక్ భార్య నటాషా అసలు స్పందించకపోవడం గమనార్హం. అటు హార్దిక్ కు సంబంధించి కానీ, ఇటు టీమిండియాకు సంబంధించి కానీ సోషల్ మీడియాలో కనీసం ఒక్క పోస్ట్ కూడా షేర్ చేయలేదామె.

Hardik Pandya: 'ఇలాంటి భార్య ఎవరికీ ఉండకూడదు'.. హార్దిక్ సతీమణి నటాషాపై అభిమానుల ఆగ్రహం.. కారణమిదే
Hardik Pandya Family
Follow us

|

Updated on: Jul 02, 2024 | 3:13 PM

బార్బడోస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. భారత్ గెలుపులో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఇక కప్ గెలిచిన అనంతరం గ్రౌండ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు హార్దిక్. గత కొన్నినెలలుగా తాను పడుతోన్న మానసిక వేదన గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. అయితే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హార్దిక్ భార్య నటాషా అసలు స్పందించకపోవడం గమనార్హం. అటు హార్దిక్ కు సంబంధించి కానీ, ఇటు టీమిండియాకు సంబంధించి కానీ సోషల్ మీడియాలో కనీసం ఒక్క పోస్ట్ కూడా షేర్ చేయలేదు. అయితే ప్రపంచకప్ గెలిచిన మూడు రోజుల తర్వాత నటాషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో మొదటిసారిగా ఒక పోస్ట్‌ను పంచుకుంది. ఈ పోస్ట్ కూడా హార్దిక్‌కి సంబంధించినది కాదు. దీంతో అభిమానులు, నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ‘మీరు హార్దిక్‌తో కలిసి ఉన్నారో లేదో చెప్పండి’ అంటూ తన పోస్ట్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఈరోజు నటాషా తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. భారత్ ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆమెకు ఇదే తొలి పోస్ట్. అందుకే అందరి దృష్టిని ఆకర్షించింది. నటాషా పోస్ట్ చేసిన ఫోటోలలో, ఆమె తన దుస్తులు, పర్సును ప్రదర్శిస్తుంది. ఈ ఫొటోలకు ‘ఫిట్ చెక్’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ ఫొటోకు లైక్స్‌ వెల్లువెత్తాయి. అయితే దానితో పాటు హార్దిక్‌పై పలువురు ప్రశ్నల వర్షం కురిపించారు. ‘హార్దిక్‌ ప్రపంచకప్‌ గెలిచాడు, అతడికి ప్రశంసల పోస్ట్‌ ఎక్కడిది’ అని ఒకరు అడిగారు. ‘నటాషా మనం ఇక వేచి ఉండలేం. నువ్వు హార్దిక్‌తో ఉన్నావో లేదో నేరుగా చెప్పు’ అని మరొకరు ప్రశ్నించారు. ‘వరల్డ్ కప్ వచ్చినా రాకపోయినా ఇలాంటి భార్య ఎవరికీ ఉండకూడదు’ అని మరికొందరు కామెంట్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

గత కొన్ని నెలలుగా హార్దిక్ పాండ్యా, నటాషాల వివాహ బంధంపై పలు రూమర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారని, ఇప్పటికే వేర్వేరుగా ఉన్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై వారిద్దరూ ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు లేవు. పెళ్లి తర్వాత నటాషా పాండ్యాను తన పేరులో చేర్చుకుంది. కానీ, ఇప్పుడు దాన్ని తొలగించింది. హార్దిక్‌తో ఉన్న కొన్ని ఫోటోలను కూడా తొలగించింది. దీంతో విడాకుల గురించి పుకార్లు వచ్చాయి. హార్దిక్, నటాషా ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

నటాషా స్టాంకోవిక్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

View this post on Instagram

A post shared by @natasastankovic__

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..