IND vs WI: ఐపీఎల్‌లో షో చేస్తే సరిపోతుందా? అయితే రంజీని ఆపేయండి.. టీమిండియా సెలెక్షన్‌పై సన్నీ ఘాటు విమర్శలు

దేశవాళీ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన చాలా మంది ఆటగాళ్లకు టీమిండియా టెస్టు జట్టులో అవకాశం దక్కలేదు. సర్ఫరాజ్ ఖాన్,  మయాంక్ అగర్వాల్, అభిమన్యు ఈశ్వరన్ వంటి పలువురు ఆటగాళ్లు రంజీల్లో మెరుగ్గారే రాణించినా టీమిండియాలో స్థానం దక్కించుకోలేకపోయారు. గ

IND vs WI: ఐపీఎల్‌లో షో చేస్తే సరిపోతుందా? అయితే రంజీని ఆపేయండి.. టీమిండియా సెలెక్షన్‌పై సన్నీ ఘాటు విమర్శలు
Sunil Gavaskar
Follow us
Basha Shek

|

Updated on: Jun 24, 2023 | 5:14 PM

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC ఫైనల్ 2023)లో ఓడిపోయిన టీమ్ ఇండియా త్వరలోనే వెస్టిండీస్‌ పర్యటనకు బయలుదేరనుంది. కరీబియన్‌ తో టెస్ట్ సిరీస్‌ ఆడడం ద్వారా వరల్డ్‌ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 3వ ఎడిషన్‌ను ప్రారంభించనుంది. దీంతో పాటు భావి భారత టెస్టు జట్టును నిర్మించేందుకు తొలి అడుగు వేసిన బీసీసీఐ.. పలువురు యువ ఆటగాళ్లకు జట్టులో అవకాశం కల్పించింది. అలాగే ఫామ్‌లో లేని అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు జట్టు నుంచి తప్పించింది. అయితే దేశవాళీ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన చాలా మంది ఆటగాళ్లకు టీమిండియా టెస్టు జట్టులో అవకాశం దక్కలేదు. సర్ఫరాజ్ ఖాన్,  మయాంక్ అగర్వాల్, అభిమన్యు ఈశ్వరన్ వంటి పలువురు ఆటగాళ్లు రంజీల్లో మెరుగ్గారే రాణించినా టీమిండియాలో స్థానం దక్కించుకోలేకపోయారు. గతంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో జట్టు ఎంపికలో తడబడిన సెలక్షన్ బోర్డు.. యువ టెస్టు జట్టును నిర్మించేందుకు బీసీసీఐ తొలిసారిగా యసస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ప్రతిభావంతులైన క్రికెటర్లకు టెస్టు జట్టులో స్థానం కల్పించింది. అయితే దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సర్ఫరాజ్ ఖాన్‌కు వెస్టిండీస్ టూర్‌లో చోటు దక్కలేదు. సెలక్షన్ బోర్డు తీసుకున్న ఈ చర్యను చాలా మంది మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. సర్ఫరాజ్ ఖాన్‌కు జట్టులో చోటు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సునీల్ గవాస్కర్.. బీసీసీఐ, సెలక్షన్ కమిటీపై ఘాటుగా విమర్శలు చేశాడు.

ఐపీఎల్‌ షో సరిపోతుందా?

సెలక్షన్ కమిటీ ప్రమాణాలపై తన అసంతృప్తిని నేరుగా వెల్లడించిన సునీల్ గవాస్కర్, ఐపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగా టెస్ట్ జట్టును ఎంపిక చేయాలంటే, రంజీ ట్రోఫీని ఆపేయండి అని సెటైర్లు వేశారు. ఐపీఎల్ ఒక్కటే కొలమానం అయితే, మూడు రంజీ సీజన్లలో 100 పరుగుల సగటు సాధించిన సర్ఫరాజ్ ఖాన్ ఎక్కడికి వెళ్లాలి? ఇప్పుడు టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోవాలంటే ఏం చేయాలి?. ప్లేయింగ్ లెవెన్ లో అవకాశం రాకపోయినా పర్వాలేదు. కనీసం అతడిని జట్టులోకి తీసుకోకూడదా? అని సెలెక్షన్‌ కమిటీపై మండిపడ్డారు. ప్రతి రంజీ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసి టీమ్ ఇండియాకు ఎంపిక కావాలని కలలు కంటున్న మీ రంజీ ప్రదర్శనను మేము పరిగణనలోకి తీసుకోవడం లేదని సర్ఫరాజ్‌కు స్పష్టంగా చెప్పండి. లేదంటే రంజీ ట్రోఫీని ఆపేయండి. ఐపీఎల్ షో రెడ్ బాల్ క్రికెట్ సెలక్షన్‌కు సరిపోతుందని సెలెక్షన్‌ కమిటీ భావిస్తున్నారని గవాస్కర్ బీసీసీఐపై విరుచుకుపడ్డాడు.

సూపర్‌ ఫామ్‌లో సర్ఫరాజ్

సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటివరకు 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 3505 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 9 అర్ధసెంచరీలు ఉన్నాయి. 79.65 సగటుతో పరుగులు చేసిన సర్ఫరాజ్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 301 పరుగులు. ఇంత మంచి రికార్డు ఉన్నప్పటికీ సర్ఫరాజ్‌ను టెస్టు జట్టులోకి తీసుకోవడంపై అతనితో పాటు మాజీ క్రికెటర్లకు ఆగ్రహం తెప్పిస్తోంది.

ఇవి కూడా చదవండి

భారత టెస్టు జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యస్సవి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ సిరాజ్ , ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు