T20 Cricket: పరుగుల వర్షం కురిపించిన జోస్ బట్లర్.. గేల్, కోహ్లీ, రోహిత్ లిస్టులోకి.. రెండో ఇంగ్లీష్ ప్లేయర్‌గా..

Jos Buttler: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్, ఇంగ్లాండ్ వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్ జోస్ బట్లర్ టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ‘టీ20 బ్లాస్ట్‌ 2023’లో లాంకాషైర్ తరఫున ఆడుతున్న బట్లర్ పొట్టి ఫార్మాట్‌లో 10000 పరుగుల మార్క్‌ని..

T20 Cricket: పరుగుల వర్షం కురిపించిన జోస్ బట్లర్.. గేల్, కోహ్లీ, రోహిత్ లిస్టులోకి.. రెండో ఇంగ్లీష్ ప్లేయర్‌గా..
Jos-Buttler Surpasses 10000 runs mark in T20
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 24, 2023 | 5:25 PM

Jos Buttler: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్, ఇంగ్లాండ్ వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్ జోస్ బట్లర్ టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ‘టీ20 బ్లాస్ట్‌ 2023’లో లాంకాషైర్ తరఫున ఆడుతున్న బట్లర్ పొట్టి ఫార్మాట్‌లో 10000 పరుగుల మార్క్‌ని దాటాడు. దీంతో ఈ ఘనత సాధించిన 9వ ఆటగాడిగా అవతరించడంతో పాటు.. ఇంగ్లాండ్ తరఫున రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండ్ తరఫున బట్లర్ కంటే ముందు అలెక్స్ హేల్స్(11,214) 10 వేల టీ20 పరుగులు చేశాడు.  శుక్రవారం డెర్బీషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లోనే 83 పరుగులు చేసిన బట్లర్‌ ఈ మార్క్‌ని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌కి ముందు 9997 పరుగులతో ఉన్న ఇంగ్లాండ్ టీ20, వన్డే సారథి.. 3 పరుగుల వద్ద 10 వేల మార్క్‌ని అందుకున్నాడు. ఇంకా తాను చేసిన 83 పరుగులతో మొత్తంగా 10080 టీ20 పరుగులు చేసినట్లయింది. బట్లర్ టీ20 కెరీర్ గురించి గమనిస్తే.. మొత్తం 372 మ్యాచ్‌ల్లో 144.70 స్ట్రైక్‌ రేట్‌, 34.16 బ్యాటింగ్ యావరేజ్‌తో ఉన్నాడు. బట్లర్ చేసిన 10080 పరుగుల్లో 6 శతకాలు, 21 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.

బట్లర్ కంటే ముందు యూనివర్సల్ బాస్‌గా ప్రసిద్ధి చెందిన క్రిస్‌ గేల్‌ నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరకు మొత్తం 8 మంది 10 వేల మార్క్‌ని అందుకున్నారు. 10 వేల రన్స్ దాటిన ప్లేయర్ల జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే.. క్రిస్‌ గేల్‌(14562, వెస్టిండీస్), షోయబ్‌ మాలిక్‌(12528, పాకిస్థాన్), కీరన్‌ పోలార్డ్‌(12175, వెస్టిండీస్), విరాట్‌ కోహ్లి (11965, భారత్), డేవిడ్‌ వార్నర్‌ (11695, ఆస్ట్రేలియా), ఆరోన్‌ ఫించ్‌(11392, ఆస్ట్రేలియా), అలెక్స్‌ హేల్స్‌ (11214, ఇంగ్లాండ్), రోహిత్‌ శర్మ(11035, భారత్), జోస్ బట్లర్(10080) ఉన్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..