AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs WI: టీమిండియా జట్టు ఎంపికలో 3 తప్పులు.. రోహిత్, ద్రవిడ్‌లను తిట్టిపోస్తున్న నెటిజన్లు..

వెస్టిండీస్‌తో జరగనున్న రెండు టెస్టులు, 3 వన్డేల సిరీస్‌లకు టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ రెండు ఫార్మాట్లకు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా..

IND Vs WI: టీమిండియా జట్టు ఎంపికలో 3 తప్పులు.. రోహిత్, ద్రవిడ్‌లను తిట్టిపోస్తున్న నెటిజన్లు..
Teamindia
Ravi Kiran
|

Updated on: Jun 24, 2023 | 5:45 PM

Share

వెస్టిండీస్‌తో జరగనున్న రెండు టెస్టులు, 3 వన్డేల సిరీస్‌లకు టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ రెండు ఫార్మాట్లకు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా.. పలువురు యువ ప్లేయర్స్‌కు తుది జట్టులో అవకాశం దక్కింది. అటు టెస్టుల్లో రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం ఇచ్చి.. ఛతేశ్వర్ పుజారాకు ఉద్వాసన పలికారు. అదే సమయంలో, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రిజర్వ్ ఓపెనర్‌గా టీమిండియాతో ఇంగ్లాండ్‌కు పయనమైన యశస్వి జైస్వాల్ కూడా టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. రోహిత్ శర్మ నేతృత్వంలో ఈ రెండు సిరీస్‌లకు ఎంపికైన జట్టు బలంగా కనిపిస్తున్నప్పటికీ.. మూడు లోపాలు ఉన్నాయని మాజీ క్రికెటర్లు అంటున్నారు. టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్టర్లు ఇలాంటి పొరపాట్లు చేస్తే వరల్డ్ కప్ గెలవడం కష్టమేనని చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

మొదటి తప్పు:

వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు అజింక్యా రహానే వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం రహనే వయస్సు 35 ఏళ్లు.. మరో రెండేళ్లలో కచ్చితంగా రిటైర్ కావచ్చు. ఇలాంటి సమయంలో అతడికి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం కొందరు మాజీ క్రికెటర్లు షాక్ అయ్యేలా చేసింది. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రస్తుతం 36 ఏళ్లు. అతడి వయస్సు, ఫిట్‌నెస్ బట్టి.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 సీజన్ మొత్తంలో వరకు సారధ్య బాధ్యతలను నిర్వహించే అవకాశం తక్కువే. అటువంటి పరిస్థితిలో, భారత సెలక్టర్లు భవిష్యత్తులో టెస్ట్ కెప్టెన్‌గా మారగలిగే ఆటగాడికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి ఉంటే బాగుండేదని మాజీ క్రికెటర్లు అంటున్నారు.

రెండో తప్పు:

ఫాస్ట్ బౌలింగ్ విషయంలోనూ టీమిండియా ఎంపికలో లోపం కనిపిస్తోంది. దేశవాళీ క్రికెట్‌లో ఎర్ర బంతితో అద్భుత ప్రదర్శన చేసిన జయదేవ్ ఉనద్కత్ భారత జట్టులో ఎడమచేతి వాటం బౌలర్‌గా ఎంపికయ్యాడు. అలాగే అతడికి వన్డే జట్టులో కూడా చోటు కల్పించారు. కానీ మరో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఈ ఫార్మాట్‌కి బెటర్ ఆప్షన్ కావచ్చు. కేవలం 24 ఏళ్ల వయస్సులో పేస్, స్వింగ్ రెండూ మార్చి.. మార్చి ప్రత్యర్ధులను బెంబేలెత్తిస్తున్నాడు. కాగా, ఉనద్కత్‌తో పాటు అర్ష్‌దీప్‌ని కూడా జట్టులో ఉంచి ఉంటే.. వన్డే జట్టులో లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు లేరు కాబట్టి ప్రపంచకప్‌లో వీరు అవసరం కావచ్చు.

మూడో తప్పు:

వెస్టిండీస్ టూర్ కోసం ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లను టీమిండియా ఎంపిక చేసింది. ఈ ముగ్గురూ ఫింగర్ స్పిన్నర్లే. అయితే టెస్టు జట్టులో మణికట్టు స్పిన్నర్ కూడా అవసరం కావచ్చు. వరల్డ్ టెస్ట్ సిరీస్ ఫైనల్‌కు ముందు బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో కుల్దీప్ యాదవ్ జట్టులో ఉన్నాడు. కానీ ఇప్పుడు అతడికి టెస్టు జట్టులో చోటు కల్పించలేదు.

భారత వన్డే జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్

టెస్టు జట్టు ఇదే:

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ