IND vs SA: గెలుపు జోష్‌లో ఉన్న దక్షిణాఫ్రికాకు ఎదురు దెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం
సెంచూరియన్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. కేవలం 3 రోజుల్లోనే టీమిండియాను చిత్తు చేసి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. సెంచూరియన్ టెస్టులో టెంబా బావుమా దక్షిణాఫ్రికాకు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే అతను గాయపడి మ్యాచ్ మొదటి రోజునే మైదానాన్ని విడిచిపెట్టాడు, ఆ తర్వాత డీన్ ఎల్గర్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. తన జట్టును విజయపథంలో నడిపించాడు.
సెంచూరియన్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. కేవలం 3 రోజుల్లోనే టీమిండియాను చిత్తు చేసి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. సెంచూరియన్ టెస్టులో టెంబా బావుమా దక్షిణాఫ్రికాకు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే అతను గాయపడి మ్యాచ్ మొదటి రోజునే మైదానాన్ని విడిచిపెట్టాడు, ఆ తర్వాత డీన్ ఎల్గర్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. తన జట్టును విజయపథంలో నడిపించాడు. ఇక టెంబా బవుమా టెస్టు సిరీస్‌కు దూరమైనందున రెండో టెస్టులో కూడా డీన్ ఎల్గర్ దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఉంటాడని వార్తలు వచ్చాయి. భారత్-దక్షిణాఫ్రికా మధ్య సిరీస్‌లో భాగంగా చివరి టెస్టు జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదకిగా జరగనుంది. ఆ టెస్టులోనూ ఎల్గర్ దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సెంచూరియన్ టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ గాయ పడ్డ రెగ్యులర్ కెప్టెన్ కోలుకోవడానికి మరికొద్ది సమయం పడుతుందని తెలుస్తోంది. గాయం తర్వాత బవుమాకు స్కానింగ్ చేయగా, పరిస్థితి కాస్త సీరియస్‌గా కనిపించింది. దీంతో భారత్‌తో జరిగే రెండో, చివరి టెస్టులోనూ డీన్ ఎల్గరే సారథిగా వ్యవహరిస్తాడని తెలుస్తోంది.
కాగా గాయం కారణంగా దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో టెంబా బావుమా ఆడే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ లీగ్‌లో అతను సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు వైద్య పరీక్షల తర్వాత బవుమా ఇక్కడ ఆడతాడా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా టెస్టు జట్టు నుంచి టెంబా బవుమాను తొలగించిన తర్వాత, కెప్టెన్సీని డీన్ ఎల్గర్‌కు అప్పగించారు. అయితే బవుమా స్థానంలో జుబేర్ హమ్జా జట్టులోకి రానున్నాడు. 28 ఏళ్ల జుబేర్ హమ్జా 2019లో పాకిస్థాన్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 6 టెస్టులు ఆడాడు. ఒక అర్ధ సెంచరీతో సహా 212 పరుగులు చేశాడు. అది కూడా భారత్ పైనే. గతేడాది రాంచీ వేదికగా జరిగిన టెస్టులో ఈ హాఫ్ సెంచరీ చేశాడు.
టెంబా బవుమా ఔట్..
🟢TEMBA BAVUMA UPDATE🟡
Following continuous medical assessments, it was determined that there was too much of a risk of aggravating his left hamstring injury had he gone out to bat at this stage of the game 🏏 🇿🇦
The medical team are managing him to give him the best chance to… pic.twitter.com/Bx3bZVhUB3
— Proteas Men (@ProteasMenCSA) December 28, 2023
🇿🇦THE PROTEAS LEAD THE FREEDOM SERIES
A mammoth all-round effort from the Proteas to take a 1-0 lead in the #Betway Test Series🇿🇦🇮🇳
What a victory by the boys 💪😅
The Final Frontier Continues 😎#WozaNawe #BePartOfIt #SAvIND pic.twitter.com/MFWVAgphxS
— Proteas Men (@ProteasMenCSA) December 28, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..