IND vs SA: ఇ’షాన్‌దార్’ ఇన్నింగ్స్.. మొదటి టీ 20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయలక్ష్యం ఎంతంటే..
India vs South Africa 2022: భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ సిరీస్‌ను భావిస్తున్నారు..
India vs South Africa 2022: భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ సిరీస్‌ను భావిస్తున్నారు. కాగా, ఈ సిరీస్‌లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతోంది. కొందరికి విశ్రాంతి ఇవ్వగా మరికొందరు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. అటువంటి పరిస్థితుల్లో ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ కోసం టీమిండియాలో తమ స్థానాన్ని ఫిక్స్ చేసుకోవాలని పలువురు యువ ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. అలాంటి వారిలో ఇషాన్ కిషన్ ఒకడు. ఐపీఎల్‌లో అంతగా రాణించని ఈ యంగ్ ప్లేయర్ దక్షిణాఫ్రికాతో మొదటి టీ 20 మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టాడు. తనపై ఉన్న అంచనాలను నిజం చేస్తూ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తం 48 బంతుల్లో 76 పరుగులు సాధించి భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. అతనితో పాటు ఇతర బ్యాటర్లు తలా ఓ చేయి వేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు సాధించింది.
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. రుతురాజ్ తో కలిసి క్రీజులోకి వచ్చిన ఇషన్ నిలకడగా ఆడాడు.ఇద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 57 పరుగులు జోడించి శుభారంభం అందించారు. రుతురాజ్ ఔటైన తర్వాత ఇషాన్ మరింత దూకుడుగా ఆడాడు. ముఖ్యంగా స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌ను ఓ ఆట ఆడుకున్నాడు. ఇషాన్ కేవలం 38 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే ఎట్టకేలకు 13వ ఓవర్లో కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కాగా ఇషాన్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్, కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ఉపయోగకరమైన ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు భారీ స్కోరు అందించారు. ముఖ్యంగా చివర్లో హార్దిక్ పాండ్యా కేవలం 12 బంతుల్లో అజేయంగా 31 పరుగులు చేసి జట్టు స్కోరును 211 పరుగుల భారీ స్కోరుకు చేర్చాడు. కాగా టీ 20ల్లో దక్షిణాఫ్రికాపై భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
IND vs SA: దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలకలం.. మహమ్మారి బారిన పడిన స్టార్ ఆటగాడు.. మ్యాచ్‌కు దూరం..
Basara RGUKT 2022: బాసర ఆర్జీయూకేటీ- 2022 అడ్మిషన్ నోటిఫికేషన్.. త్వరలోనే..