Beauty Tips: కళ్ల కింద నల్లటి వలయాలు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఈ ఆహార పదార్థాలను మీ డైట్ లో చేర్చుకోవాల్సిందే..
Dark Circles Under Eyes: తీవ్రమైన పని ఒత్తిడికి తోడు శారీరక, మానసిక ఆందోళన సమస్యలతో కంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా నిద్రలేమి కారణంగా చాలామంది కళ్లకింద నల్లటి వలయాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి.
Dark Circles Under Eyes: తీవ్రమైన పని ఒత్తిడికి తోడు శారీరక, మానసిక ఆందోళన సమస్యలతో కంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా నిద్రలేమి కారణంగా చాలామంది కళ్లకింద నల్లటి వలయాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. దీనివల్ల ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. మీకు కూడా అలాంటి సమస్య ఎదురైతే, మీ దినచర్యను మెరుగుపరచుకోవడంతో పాటు తీసుకునే ఆహారంపై కూడా శ్రద్ధ పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలోని పోషకాల లోపాన్ని తొలగిస్తే, అన్ని సమస్యలూ వాటంతట అవే తగ్గిపోతాయని సూచిస్తున్నారు. మరి కళ్లకింద నల్లటి వలయాలను తగ్గించుకునేందుకు డైట్‌లో ఎలాంటి ఆహార పదార్థాలను చేర్చుకోవాలో తెలుసుకుందాం రండి.
ఐరన్ కోసం..
శరీరంలో ఐరన్ లోపించడం వల్ల ఆ ప్రభావం కళ్ల చుట్టూ కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో, కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఆహారంలో అరటి, బచ్చలికూర, మెంతులు, ఆకు కూరలు, బీన్స్, పప్పు, నట్స్, బ్రౌన్ రైస్ వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను బాగా తీసుకోవాలి.
విటమిన్ ఎ కోసం..
మెరుగైన కంటి ఆరోగ్యానికి విటమిన్ ఎ ఉన్న ఆహారం చాలా ముఖ్యం. ఈ విటమిన్ కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. విటమిన్ ఎ లోపంతో కళ్ల కింద నల్లటి వలయాల సమస్యతో పాటు మొటిమలు, ముడతలు వంటి పలు చర్మ సంబంధిత సమస్యలు వేధిస్తాయి. విటమిన్ ఎ లోపాన్ని అధిగమించడానికి మీరు ఆహారంలో పాలు, టమోటా, బత్తాయి, చేపలు, గుడ్డు, రెడ్ క్యాప్సికమ్ వంటి వాటిని చేర్చుకోవచ్చు.
విటమిన్ సి కోసం..
విటమిన్ సి యాంటీఆక్సిడెంట్స్‌లో పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా శరీరంలో విషతుల్య పదార్థాలు బయటకు పోతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్ సి లోపం వల్ల ముఖం, కళ్ల చుట్టూ ముడతలు ఏర్పడతాయి. ఇటువంటి పరిస్థితుల్లో చర్మాన్ని మృదువుగా ఉంచుకోవడానికి, కళ్ల చుట్టూ నల్లటి వలయాలను తొలగించడానికి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇందుకోసం బ్రకోలీ, టొమాటో, నిమ్మ, నారింజ, బచ్చలికూర, క్యాలీఫ్లవర్ మొదలైన వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.
విటమిన్ ఇ కోసం..
విటమిన్-ఇ లోపం వల్ల శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందదు. దీని ప్రభావం మీ చర్మం, కళ్లపై కూడా కనిపిస్తుంది. విటమిన్ ఇ లోపం వల్ల కంటి చూపు దెబ్బతింటుంది. అదేవిధంగా నల్లటి వలయాలు కూడా ఏర్పాడతాయి. ఈ సమస్యను అధిగమించాలంటే విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. దాని లోపాన్ని అధిగమించడానికి, బాదం, వేరుశెనగ, బచ్చలికూర, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుడ్లు, వాల్‌నట్‌లు, ఆకుకూరలు, బ్రకోలీ, మామిడి, బొప్పాయి మొదలైన వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
IND vs SA: దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలకలం.. మహమ్మారి బారిన పడిన స్టార్ ఆటగాడు.. మ్యాచ్‌కు దూరం..