AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలకలం.. మహమ్మారి బారిన పడిన స్టార్‌ ఆటగాడు.. మ్యాచ్‌కు దూరం..

India vs South Africa 2022: భారత్‌లో పర్యటిస్తోన్న దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలకలం రేపింది. జట్టు స్టార్ బ్యాటర్‌ ఐడాన్ మార్క్ రమ్ కొవిడ్‌ బారిన పడ్డాడు.

IND vs SA: దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలకలం.. మహమ్మారి బారిన పడిన స్టార్‌ ఆటగాడు.. మ్యాచ్‌కు దూరం..
Ind Vs Sa
Basha Shek
|

Updated on: Jun 09, 2022 | 7:35 PM

Share

India vs South Africa 2022: భారత్‌లో పర్యటిస్తోన్న దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలకలం రేపింది. జట్టు స్టార్ బ్యాటర్‌ ఐడాన్ మార్క్ రమ్ కొవిడ్‌ బారిన పడ్డాడు. కాగా ఢిల్లీ వేదికగా మొదటి టీ20 మ్యాచ్‌ ప్రారంభంకావడానికి కొద్ది సమయానికి ముందే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా కారణంగా మార్క్‌రామ్ తుది జట్టులో ఉండడం లేదని టాస్ సమయంలో జట్టు కెప్టెన్ తంబా బావుమా చెప్పాడు. మర్కరమ్‌ స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్ జట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు. అయితే అతనికి ఎప్పటినుంచి ఇన్ఫెక్షన్‌ సోకింది? జట్టులోని ఇతర సభ్యులెవరైనా అతనితో కాంటాక్ట్‌లో ఉన్నారా? అన్నది మాత్రం బావుమా స్పష్టత నివ్వలేదు. మరోవైపు ఈ విషయంపై అటు అటు సౌతాఫ్రికా క్రికెట్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ -2022)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్‌లో మార్కరమ్‌ కీలక పాత్ర పోషించాడు. 14 మ్యాచ్‌లు ఆడి.. 381 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలున్నాయి. ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ దూరం కావడం సౌతాఫ్రికాకు ఎదురుదెబ్బేనని చెప్పుకోవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ 20 మ్యాచ్‌.. ఆ ఇద్దరి ఆటగాళ్ల రీ ఎంట్రీ.. ప్లేయింగ్-XI ఎలా ఉందంటే..

Viral Video: అరే ఏంట్రా ఇది.. ఉన్నట్లుండి నదిలోంచి ఊడిపడ్డ రియల్ స్పైడర్ మ్యాన్.. ట్రైన్ ప్యాసింజర్‌కు సర్‌ప్రైజ్ షాక్ ఇచ్చాడు..!

Ranji Trophy 2022: 93 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన ముంబై.. రంజీల్లో అరుదైన ఘనత.. బుల్లి సచిన్ సారథ్యంలోనే..