IND vs PAK: ఇండియాని ఓడించాక పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందో తెలుసా.. వీడియో చూడండి..
IND vs PAK: టీ20 ప్రపంచకప్ 2021లో భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓటమికి గల కారణాలను
IND vs PAK: టీ20 ప్రపంచకప్ 2021లో భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓటమికి గల కారణాలను అంచనా వేస్తుంటే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సహచర ఆటగాళ్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూంలో సంబరాలు జరగలేదు. ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో పాకిస్తాన్.. భారత్‌ని ఓడించాక సంబరాలు చేసుకోకుండా వేరే పనిలో నిమగ్నమై ఉండటం మనం చూడవచ్చు. పాక్ జట్టు ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది అందరూ డ్రెస్సింగ్ రూమ్‌లో సమావేశమయ్యారు. భారత్‌ను ఓడించిన తర్వాత పాక్ జట్టులో కనిపించాల్సిన ఆనందం, సందడి కనిపించలేదు. ఈ వీడియోను పాకిస్తాన్ క్రికెట్ ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసింది. దీనిలో కెప్టెన్, కోచ్ జట్టును ఉద్దేశించి గేమ్ ప్లాన్ గురించి ఆటగాళ్లకు వివరించారు.
ప్రపంచకప్ గెలవడంపై దృష్టి ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా మొదట కెప్టెన్ బాబర్ అజమ్ జట్టును ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశంపై విజయం సాధించిన తర్వాత మనం చాలా నేర్చుకోవాల్సి ఉంది. సంబరాలు చేసుకోవడం అవసరం లేదు. ఎందుకంటే మనం కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచాం. పని ఇంకా పూర్తి కాలేదు. మితిమీరిన ఆత్మవిశ్వాసానికి బలి కావద్దు. ప్రపంచ కప్ గెలవడంపై దృష్టిసారించాలని సహచరులకు దిశానిర్దేశం చేశారు.
ఆటగాళ్లకు అభినందనలు.. కెప్టెన్ బాబర్ అజామ్ తర్వాత జట్టు ప్రధాన కోచ్ సక్లైన్ ముస్తాక్ కూడా మాట్లాడారు. అతను మొదటగా భారత్‌ను ఓడించిన ప్లేయింగ్ XI ఆటగాళ్లను అభినందించారు. ఆ తర్వాత ప్రపంచకప్ గెలవడంపై ఆటగాళ్లు దృష్టి సారించాలని తెలిపారు.
The captain and head coach address the players after Pakistan’s historic win over India. #WeHaveWeWill pic.twitter.com/Laww5iTMzX
— Pakistan Cricket (@TheRealPCB) October 24, 2021