AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office: ఈ 2 పోస్టాఫీసు పథకాలతో మంచి లాభాలు..! తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం..

Post Office: కిసాన్ వికాస్ పత్ర (KVP), నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (NSC) రెండూ భారత ప్రభుత్వ పథకాలు. వీటిని పోస్ట్ ఆఫీస్‌లో తీసుకోవచ్చు. అయితే

Post Office: ఈ 2 పోస్టాఫీసు పథకాలతో మంచి లాభాలు..! తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం..
Kvp
uppula Raju
|

Updated on: Oct 25, 2021 | 9:53 AM

Share

Post Office: కిసాన్ వికాస్ పత్ర (KVP), నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (NSC) రెండూ భారత ప్రభుత్వ పథకాలు. వీటిని పోస్ట్ ఆఫీస్‌లో తీసుకోవచ్చు. అయితే ఈ రెండింటి మధ్య ఏది ఉత్తమం అనే విషయంలో అందరు గందరగోళానికి గురవుతారు. కిసాన్ వికాస్ పత్ర రిటర్న్స్ ఇస్తుంది. కానీ మీరు దీనిపై పన్ను ఆదా చేయలేరు. అందువల్ల పన్ను ఆదా చేయాల్సిన డిపాజిటర్లకు KVP కంటే NSC ఉత్తమం. కానీ రిటర్న్స్ పరంగా KVP వడ్డీ విషయంలో NSC కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది.

NSC పథకంలో డిపాజిటర్ సంవత్సరానికి 6.8 శాతం హామితో ఉన్న వడ్డీని పొందుతాడు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌సి పథకంలో 6.8 శాతం వడ్డీని ఇస్తున్నారు. వడ్డీ రేటు మారితే రాబడి కూడా మారుతుంది. NSC 5 సంవత్సరాలు డిపాజిట్‌ చేయాలి. ఈ సమయంలో డబ్బులను ఉపసంహరించుకోలేరు. మెచ్యూరిటీ తరువాత వడ్డీని మొత్తంతో పాటుగా చెల్లిస్తారు. మీరు కేవలం రూ.100తో ఈ పథకంలో పొదుపు చేయడం ప్రారంభించవచ్చు.

KVP కూడా ప్రభుత్వ-ఆధారిత డిపాజిట్ పథకం. KVP లో కూడా హామి ఇచ్చే రాబడి ఉంటుంది. లేఖ జారీ చేసే సమయంలో నిర్ణయించిన వడ్డీ రేటు చెల్లిస్తారు. కస్టమర్ కోరుకుంటే 30 నెలల తర్వాత ఆ లేఖను వడ్డీతో రీడీమ్ చేయవచ్చు. ప్రస్తుతం KVP పై వడ్డీ రేటు 6.9 శాతం. ఒక మైనర్ కూడా KVP ని తీసుకోవచ్చు. ఎన్‌ఎస్‌సి మాదిరి దీనిని నిబంధనల ప్రకారం మరొకరికి బదిలీ చేయవచ్చు. NSCకి KVPకి తేడా ఏంటంటే KVP పై మెచ్యూరిటీపై పన్ను పొందలేరు. కెవిపిలో కనీస డిపాజిట్ మొత్తం రూ .1000.

ఇంట్లో ధనలక్ష్మి కొలువుండాలంటే ఈ తప్పులు అస్సలు చేయకండి..!

Man swallows phone: ఫోన్ మింగేసిన ఘనుడు..ఆరు నెలలకు అసలు సంగతి..! వైరల్ అవుతున్న వీడియో..

IND Vs PAK: టీమిండియాను కొంపముంచిన ‘ఆ నలుగురు’.. ధోని-శాస్త్రి వ్యూహం విఫలం.. ‘ఛాంపియన్‌’గా పాక్..