AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance JioPhone Next: రిలయెన్స్ జియో మార్ట్‌ల ద్వారా జియోఫోన్ నెక్స్ట్ అమ్మకాలు.. ఎప్పటి నుంచి అంటే..

 గూగుల్..రిలయన్స్ జియో సంయ్యుక్తంగా సిద్ధం చసిన 4జి స్మార్ట్ ఫోన్ జియోఫోన్ నెక్స్ట్. ఈ ఫోన్ ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ ఫోన్ సెప్టెంబర్ 10న మార్కెట్లోకి రావాల్సి ఉంది.

Reliance JioPhone Next: రిలయెన్స్ జియో మార్ట్‌ల ద్వారా జియోఫోన్ నెక్స్ట్ అమ్మకాలు.. ఎప్పటి నుంచి అంటే..
Jiophone Next
KVD Varma
|

Updated on: Oct 25, 2021 | 12:02 PM

Share

Reliance JioPhone Next: గూగుల్..రిలయన్స్ జియో సంయ్యుక్తంగా సిద్ధం చసిన 4జి స్మార్ట్ ఫోన్ జియోఫోన్ నెక్స్ట్. ఈ ఫోన్ ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ ఫోన్ సెప్టెంబర్ 10న మార్కెట్లోకి రావాల్సి ఉంది. కానీ, సెమి కండక్టర్ కొరత వలన ఫోన్ విడుదల ఆలస్యం అయింది. ఇప్పుడు ఈ ఫోన్ దీపావళి కానుకగా నవంబర్ 4 వ తేదీ లేదా దానికి కొద్దిగా ముందు మార్కెట్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో రిలయన్స్ నుంచి తాజాగా కొత్త సమాచారం వెలువడింది. రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ జియో మార్ట్ డిజిటల్ నెట్‌వర్క్‌ను మార్కెట్ చేయడానికి సిద్ధం అయింది.

“జియోమార్ట్ డిజిటల్ అనేది అసిస్టెంట్ సేల్ ప్లాట్‌ఫామ్. దీనిని మేము కొత్త కామర్స్ మోడల్ ద్వారా భారతదేశంలోని చాలా చిన్న డిజిటల్ రిటైలర్లకు విస్తరిస్తున్నాము. లక్షలాది మంది మా పంపిణీ నెట్‌వర్క్‌కు తీసుకురావాలనుకుంటున్నాము” అని రిలయన్స్ రిటైల్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, దినేశ్ థాపర్ చెప్పారు. “వాటి ద్వారా, జియోఫోన్ నెక్స్ట్ సాధ్యమైనంత విస్తృతమైన లభ్యతను కలిగి ఉండేలా చూసుకుంటాం.” అని థాపర్ చెప్పారు.

మొబైల్ ఫోన్లు, స్థానిక ఎలక్ట్రానిక్‌లను విక్రయించే వందల వేల పొరుగు దుకాణాలను రిలయన్స్ రిటైల్ చేరుతోంది. వారి దుకాణాలను జియోమార్ట్ డిజిటల్‌గా మార్చే అవకాశాన్ని అందిస్తోంది. జియోమార్ట్ డిజిటల్ సేవలకు లేదా రిలయన్స్ డిజిటల్ సేవలకు ప్రాప్యత లేని వినియోగదారుల కోసం ఈ దుకాణాలు కేటలాగ్ అమ్మకాలను కూడా చేస్తాయి.

జియోఫోన్ నెక్స్ట్ కోసం రిలయన్స్ రిటైల్ అమ్మకాల తర్వాత సేవలు ఫైనాన్స్ ఎంపికలను కూడా అందిస్తుంది.

ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో, రిలయన్స్ రిటైల్ ఫోన్‌లు, టీవీలు, గృహోపకరణాలతో సహా అన్ని కీలకమైన వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌లో రెండంకెల వృద్ధిని సాధించింది. Reliancedigital.in 2,000 నగరాలకు విస్తరించిం. ఆరు గంటల కంటే తక్కువ వ్యవధిలో 90% డెలివరీలు దాని స్టోర్ల నుండి జరుగుతున్నాయని కంపెనీ తన క్వార్టర్లీ ఫలితాలను వెల్లడిస్తూ చెప్పింది.

ఇవి కూడా చదవండి: PM Modi: వారణాసి పర్యటనకు నరేంద్ర మోడీ.. 64 కోట్లతో ప్రజారోగ్యం కోసం ఆత్మనిర్భర్ స్వస్త్ భారత్‌కు శ్రీకారం చుట్టనున్న ప్రధాని!

First Election in India: మన దేశంలో తొలి ఓటు పడింది ఈరోజే.. తొలిసారి ఎన్నికలు ఎలా నిర్వహించారో తెలుసా?

Snow Fall: మూడు అడుగుల మేర కురిసిన మంచు..అటల్ టన్నెల్ వద్ద నిలిచిపోయిన రాకపోకలు!