Ind Vs Pak: కెప్టెన్‎గా హుందాతనాన్ని ప్రదర్శించిన విరాట్ కోహ్లీ.. రిజ్వాన్‌ను కౌగిలించుకుని అభినందనలు..

టీ20 ప్రపంచ కప్‎లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‎లో భారత్‎పై పాకిస్తాన్ 10 వికెట్ల తేడా విజయం సాధించింది. టీ 20 వరల్డ్ కప్‎లో పాక్ ఇండియాను ఓడించడం ఇదే మొదటిసారి...

Ind Vs Pak: కెప్టెన్‎గా హుందాతనాన్ని ప్రదర్శించిన విరాట్ కోహ్లీ.. రిజ్వాన్‌ను కౌగిలించుకుని అభినందనలు..
Virat
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 25, 2021 | 10:45 AM

టీ20 ప్రపంచ కప్‎లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‎లో భారత్‎పై పాకిస్తాన్ 10 వికెట్ల తేడా విజయం సాధించింది. టీ 20 వరల్డ్ కప్‎లో పాక్ ఇండియాను ఓడించడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు ఐదు టీ20 మ్యాచుల్లో ఐందింటిలో టీం ఇండియా గెలుపొందింది. ఆరో మ్యాచ్‎లో పాక్ విక్టరీ సాధించింది. ‘మెన్ ఇన్ బ్లూ’ టీ20, వన్డే ప్రపంచ కప్‌లలో మొత్తం 12 మ్యాచుల్లో పాకిస్తాన్‎ను ఓడించింది. ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్‌లో టీం ఇండియాకు ఘోర పరాజయం ఎదురైనప్పటికీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదర్శవంతమైన క్రీడాస్ఫూర్తిని చాటారు. అతను పాకిస్థాన్ ఓపెనర్లకు అభినందనలు తెలిపాడు, రిజ్వాన్‌ని కౌగిలించుకుని అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌కి ప్రశంసలు ఇచ్చారు. దీంతో సరిహద్దుల్లోని అభిమానులు కోహ్లీని అభినందిస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నారు.

ఈ మ్యాచ్‎లో152 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. ఓపెనర్లు రిజ్వాన్‌, అజమ్‌లు భారత బౌలర్లకు చుక్కులు చూపించారు. ఎక్కడ తడబడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా పాక్‌ జయ కేతనాన్ని ఎగరవేసింది. అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన భారత్‌ మొదటి నుంచి తడబడింది. పాకిస్థాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంలో భారత ఆటగాళ్లు పెవిలియన్‌ బాట పట్టారు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో కేవలం విరాట్‌ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్‎ను విరాట్ ఆదుకున్నాడు. 48 బంతుల్లో 57(ఐదు ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేశాడు. సహచరులు ఔటైనా కెప్టెన్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. రిషబ్ పంత్, రవీంద్ర జాడేజాతో కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

Read Also..  Ind Vs Pak: మనం ఈ మ్యాచ్ చూడలేదు.. అస్సలు ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగలేదు.. ఎవరు అడిగినా ఇదే చెప్పాలి సరేనా..