AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: బుగ్గపై త్రివర్ణ పతాకం.. గుండెల నిండా కోహ్లీ.. ఫిదా చేస్తోన్న పాక్ యువతి.. వీడియో చూస్తే మనసు పారేసుకుంటారంతే

IND vs PAK: ఈసారి ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతోంది. ఆ విధంగా శ్రీలంకలో టీమిండియా తన మ్యాచ్‌లు ఆడుతోంది. కాబట్టి, పాక్ గడ్డపై కోహ్లి ఆడడం పాక్ అభిమానులు చూసే అవకాశం లేదు. కాబట్టి కోహ్లీ ఆటను చూడాలంటే పాకిస్థాన్‌లోని కోహ్లీ అభిమానులు శ్రీలంకకు తరలివచ్చారు. అందుకు తగ్గట్టుగానే శనివారం పల్లెకెలె వేదికగా జరిగిన భారత్-పాక్ మ్యాచ్ ఉత్కంఠను వర్షం మింగేసింది. భారత్ ఇన్నింగ్స్ తర్వాత పాకిస్థాన్ బ్యాటింగ్ చేయలేకపోయింది.

Video: బుగ్గపై త్రివర్ణ పతాకం.. గుండెల నిండా కోహ్లీ.. ఫిదా చేస్తోన్న పాక్ యువతి.. వీడియో చూస్తే మనసు పారేసుకుంటారంతే
Pak Fan For Kohli
Venkata Chari
|

Updated on: Sep 03, 2023 | 4:00 PM

Share

ఆసియా కప్ 2023లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య (India Vs Pakistan) మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. అయితే, మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌తో మైదానం సందడిగా మారింది. వర్షం కారణంగా టీమ్ ఇండియా బౌలింగ్ చూడలేకపోయింది. అయితే భారత్ బ్యాటింగ్‌ను అభిమానులు వీక్షించారు. ముఖ్యంగా కోట్లాది మంది అభిమానులున్న విరాట్ కోహ్లీ ఆట చూసేందుకు వచ్చిన అభిమానులను మాత్రం నిరాశపరిచాడు. అయితే ఇంతలోనే రన్ మెషీన్ బ్యాటింగ్ చూసేందుకు పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ మహిళా అభిమాని.. కింగ్ కోహ్లీపై తన మాటలతో టీమిండియా అభిమానుల మనసు దోచుకుంది.

హైబ్రిడ్ మోడల్‌లో ఆసియా కప్..

ఈసారి ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతోంది. ఆ విధంగా శ్రీలంకలో టీమిండియా తన మ్యాచ్‌లు ఆడుతోంది. కాబట్టి, పాక్ గడ్డపై కోహ్లి ఆడడం పాక్ అభిమానులు చూసే అవకాశం లేదు. కాబట్టి కోహ్లీ ఆటను చూడాలంటే పాకిస్థాన్‌లోని కోహ్లీ అభిమానులు శ్రీలంకకు తరలివచ్చారు. అందుకు తగ్గట్టుగానే శనివారం పల్లెకెలె వేదికగా జరిగిన భారత్-పాక్ మ్యాచ్ ఉత్కంఠను వర్షం మింగేసింది. భారత్ ఇన్నింగ్స్ తర్వాత పాకిస్థాన్ బ్యాటింగ్ చేయలేకపోయింది. దీంతో మ్యాచ్ రద్దయింది. దీంతో ఫుల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులకు కూడా నిరాశే మిగిలింది.

ఇవి కూడా చదవండి

4 పరుగులకే పెవిలియన్ చేరిన కోహ్లీ..

దీంతో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లాంటి టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్‌ల బ్యాటింగ్‌ను చూసేందుకు వచ్చిన వారు కూడా షాక్‌కు గురయ్యారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లను పేసర్ షాహీన్ షా ఆఫ్రిది క్లీన్ బౌల్డ్ చేశాడు. ముఖ్యంగా కోహ్లి బ్యాటింగ్ చూసేందుకు పాకిస్థాన్ నుంచి వచ్చిన అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ కేవలం 4 పరుగులకే పెవిలియన్ చేరి భారత్‌నే కాకుండా పాక్ అభిమానులను కూడా నిరాశపరిచాడు.

కోహ్లీ అంటే నాకు చాలా ఇష్టం: పాకిస్థాన్ యువతి

వర్షం కారణంగా మ్యాచ్ రద్దయిన తర్వాత పాక్ యువతి మాట్లాడుతూ.. విరాట్ కోహ్లి ఆటను చూసేందుకు ఇక్కడికి వచ్చాను. అలాగే అతని నుంచి సెంచరీ ఆశించాను. కానీ, కోహ్లి తొందరగానే ఔటయ్యాడు. అది నా హృదయాన్ని బద్దలు కొట్టింది’ అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత బాబర్ ఆజం, విరాట్ కోహ్లీలలో ఎవరిని ఎంచుకుంటారు? అనే ప్రశ్నకు ఆ యువతి ఏమాత్రం తడుముకోకుండా, చిరునవ్వుతో తన వేళ్లతో V గుర్తును రాసి ‘అఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ’ అంటూ బదులిచ్చింది. దీంతో పక్కన ఉన్న వారంతా ప్యారీ, ప్యారీ అంటూ ఆటపట్టించారు. దీంతో చిరునవ్వులు చిందిస్తూ చాలా సందడిగా కనిపించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
బంగారం వెండి కంటే ఖరీదైన 'ఎర్రబంగారం'.. వీటిని కలలో కూడా కొనలేం!
బంగారం వెండి కంటే ఖరీదైన 'ఎర్రబంగారం'.. వీటిని కలలో కూడా కొనలేం!
సంక్రాంతి రద్దీతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడి.. హద్దు మీరితే అంతే
సంక్రాంతి రద్దీతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడి.. హద్దు మీరితే అంతే
మనుషులు ఎందుకు దండగా.. ఏఐ ఉండగా..
మనుషులు ఎందుకు దండగా.. ఏఐ ఉండగా..
ఆకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా రొమాంటిక్ రీల్ వైరల్
ఆకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా రొమాంటిక్ రీల్ వైరల్
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ క్యాలెండర్‌పై బిగ్ అప్డేట్
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ క్యాలెండర్‌పై బిగ్ అప్డేట్
బాయిలోన బల్లి పలికే పాటకు ఎంత ఇచ్చారంటే.. సింగర్ నాగవ్వ..
బాయిలోన బల్లి పలికే పాటకు ఎంత ఇచ్చారంటే.. సింగర్ నాగవ్వ..