IND vs NZ: గిల్, పంత్ అర్ధ సెంచరీలు.. లంచ్ బ్రేక్ వరకు టీమిండియా స్కోరు ఎంతంటే?

ముంబై వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతోన్న మూడో టెస్టులో టీమిండియా కోలుకుంది. మొదటి రోజు చివరి 2 ఓవర్లోలో మూడు వికెట్లు కోల్పోయిన భారత జట్టు రెండో రోజు (నవంబర్ 02) నిలకడగా ఆడింది. శుభమన్ గిల్, రిషబ్ పంత్ అర్ధసెంచరీలతో మెరిశారు.

IND vs NZ: గిల్, పంత్ అర్ధ సెంచరీలు.. లంచ్ బ్రేక్ వరకు టీమిండియా స్కోరు ఎంతంటే?
Team India
Follow us

|

Updated on: Nov 02, 2024 | 12:53 PM

ముంబై టెస్టులో రెండో రోజు తొలి సెషన్ ఆట ముగిసింది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ కంటే 40 పరుగులు వెనుకబడి ఉంది. భారత్ తరఫున గిల్ 70 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. 60 పరుగుల వద్ద అవుట్ కావడంతో టీమిండియాఐదో వికెట్ కోల్పోయింది. పంత్, గిల్ కలిసి ఐదో వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఓవర్ నైట్ స్కోరు 86/4 తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ కు గిల్, పంత్ భారీ భాగస్వామ్యం అందించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పంత్ బ్యాక్ టు బ్యాక్ ఫోర్లతో న్యూజిలాండ్ బౌలర్ల లయను దెబ్బ తీశాడు.  రిషభ్ పంత్ (60: 59 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు)  వన్డే మాదిరిగా ఆడడంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. అదే క్రమంలో గిల్‌తో కలిసి ఐదో వికెట్‌కు 94 పరుగులు జోడించారు.

ఇవి కూడా చదవండి

అయితే  వీరిద్దరికి స్వల్ప వ్యవధిలో లైఫ్‌లు దొరికాయి. న్యూజిలాండ్‌ ఫీల్డర్లు రెండు క్యాచ్‌లను నేలపాలు చేశారు.  దీంతో వాటిని సద్వినియోగం చేసుకున్న పంత్ – గిల్  అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. అయితే, ఇన్నింగ్స్‌లో 38వ ఓవర్‌ వేసిన స్పిన్నర్ సోధి బంతిని అంచనా వేయడంలో పంత్  తడబడ్డాడు.  అంపైర్‌ ఎల్బీ ఇవ్వడంతో డీఆర్‌ఎస్‌ తీసుకున్నా సానుకూల ఫలితం రాలేదు. దీంతో నిరాశగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌట్ అయింది.

ఇంకా 40 పరుగుల వెనుకంజలో టీమిండియా..

టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్:

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.

న్యూజిలాండ్ ప్లేయింగ్ ఎలెవన్ :

టామ్ లాథమ్ (కెప్టెన్), డ్వేన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్క్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మార్చురీ నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా.. వామ్మో..
మార్చురీ నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా.. వామ్మో..
మీ వాహనంలో పెట్రోల్‌ వేయిస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
మీ వాహనంలో పెట్రోల్‌ వేయిస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
ప్రతిరోజూ ఉప్పు నీరు తాగితే జరిగేది ఇదే.. ఊహించలేని లాభాలు!
ప్రతిరోజూ ఉప్పు నీరు తాగితే జరిగేది ఇదే.. ఊహించలేని లాభాలు!
పెద్ద కష్టం కాదులెండి..! కానీ కనిపెట్టండి చూద్దాం.!
పెద్ద కష్టం కాదులెండి..! కానీ కనిపెట్టండి చూద్దాం.!
ఆర్గానిక్ ఫుడ్స్‌ తినడం ఆరోగ్యకరమేనా.. నిపుణులు ఏం అంటున్నారంటే..
ఆర్గానిక్ ఫుడ్స్‌ తినడం ఆరోగ్యకరమేనా.. నిపుణులు ఏం అంటున్నారంటే..
కేవలం రూ.1,198 రీఛార్జ్‌తో ఏడాది వ్యాలిడిటీ.. BSNL సూపర్ ప్లాన్
కేవలం రూ.1,198 రీఛార్జ్‌తో ఏడాది వ్యాలిడిటీ.. BSNL సూపర్ ప్లాన్
గిల్, పంత్ అర్ధ సెంచరీలు..లంచ్ బ్రేక్ కు టీమిండియా స్కోరు ఎంతంటే?
గిల్, పంత్ అర్ధ సెంచరీలు..లంచ్ బ్రేక్ కు టీమిండియా స్కోరు ఎంతంటే?
ఇండో-పాక్ యుద్ధంలో డేగ రూపంలో భక్తులను రక్షించిన అమ్మవారు..
ఇండో-పాక్ యుద్ధంలో డేగ రూపంలో భక్తులను రక్షించిన అమ్మవారు..
జైలు నుంచి రిలీజైన దర్శన్‌కు బిగ్ షాక్ ?
జైలు నుంచి రిలీజైన దర్శన్‌కు బిగ్ షాక్ ?
కిరణ్ అబ్బవరం 'క' దూకుడు.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కిరణ్ అబ్బవరం 'క' దూకుడు.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?