IND vs NZ: భారత్ ఓటమిపై బీసీసీఐ సీరియస్.. ఆ సీనియర్ ప్లేయర్లపై వేటు! సొంత గడ్డపై ఆఖరి మ్యాచ్ ఆడేసినట్టే!
టీమ్ ఇండియాకు సంబంధించి ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఘోర పరాజయంపై బీసీసీఐ ఆగ్రహంగా ఉందని సమాచారం. ఇందులో భాగంగానే ప్రస్తుతం జట్టులోని చాలా మంది సీనియర్ ఆటగాళ్లను టెస్టు ఫార్మాట్ నుంచి తప్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
న్యూజిలాండ్‌తో జరిగిన ఘోర పరాజయం తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఈ ఓటమిని పూర్తి సమీక్ష జరపాలని నిర్ణయించింది. ఈ సిరీస్‌లో టీమ్ ఇండియా ప్రదర్శన చాలా పేలవంగా ఉందని, 0-3 తేడాతో ఓటమి పాలవ్వడంపై బీసీసీఐ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు పూర్తిగా ఫ్లాప్ కావడం ఆందోళన కలిగించే అంశం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత, BCCI కఠిన చర్యలు తీసుకోనుందని సమాచారం. ఇందులో భాగంగా కొంతమంది సీనియర్ ఆటగాళ్లను టెస్ట్ జట్టు నుండి తప్పించనుందని ప్రచారం జరుగుతోంది.. ఇందులో పలువురు స్టార్ ప్లేయర్ల పేర్లు ఉన్నాయి. దీంతో కొందరు సీనియర్ ఆటగాళ్లు స్వదేశంలో తమ చివరి మ్యాచ్‌ని ఆడేశారని తెలుస్తోంది. మీడియా కథనాల ప్రకారం, ఆస్ట్రేలియా పర్యటన తర్వాత, కొంతమంది వెటరన్ ఆటగాళ్ల కెరీర్ ఈ ఫార్మాట్‌లో ముగియవచ్చు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తదుపరి సైకిల్ ప్రారంభానికి ముందే జట్టులోని అనుభవజ్ఞులైన ఆటగాళ్ల ను తప్పించాలని బీసీసీఐ యోచిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లలో కనీసం ఇద్దరికి ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ చివరిది అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నలుగురు స్టార్ ఆటగాళ్ల అంతర్జాతీయ కెరీర్ చివరి దశలో ఉంది. విరాట్, రోహిత్, జడేజా కూడా టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యారు.
‘సీనియర్ ఆటగాళ్లతో జట్టు పురోగతిపై బీసీసీఐ ప్రముఖులు మరియు సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, చీఫ్ హెడ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ మధ్య అనధికారిక చర్చలు ఉండవచ్చు ఇది దారుణ పరాభవం. అయితే ఆస్ట్రేలియా సిరీస్ దగ్గర పడింది. టీమిండియా నవంబర్ 10 న ఆస్ట్రేలియాకు బయలుదేరుతుంది’ ఇప్పటికే జట్టును ప్రకటించారు, కాబట్టి ప్రస్తుతం జట్టులో ఎలాంటి మార్పులు ఉండవు’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ఆర్ అశ్విన్ ల ఆట గణనీయంగా తగ్గింది. అటువంటి పరిస్థితిలో, BCCI యువ ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇందులో సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ వంటి ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. అదే సమయంలో, ఆస్ట్రేలియా సిరీస్ ముగిసిన తర్వాత, భారతదేశంలో అశ్విన్ భవిష్యత్తుపై చర్చ ఉండవచ్చు. అతను న్యూజిలాండ్ సిరీస్‌లో పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. మరోవైపు, వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. అతను జట్టుకు ఎక్కువ కాలం ఆడగలడు. అయితే మెరుగైన ఫిట్‌నెస్‌తో పాటు విదేశీ పిచ్‌లపై బాగా బ్యాటింగ్ చేసే జడేజా మరికొంత కాలం టెస్టు జట్టులో కొనసాగే అవకాశముంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..