AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: డబుల్ సెంచరీ కొట్టేసిన గిల్.. ఉప్పల్ స్టేడియంలో సచిన్ రికార్డు‌కు బ్రేకులు..

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన శుభ్మన్ గిల్.. తనదైన ఆటతో అభిమానులకు మాంచి కిక్ ఇచ్చాడు.

Watch Video: డబుల్ సెంచరీ కొట్టేసిన గిల్.. ఉప్పల్ స్టేడియంలో సచిన్ రికార్డు‌కు బ్రేకులు..
Shubman Gill Ind Vs Nz
Venkata Chari
|

Updated on: Jan 18, 2023 | 5:41 PM

Share

IND vs NZ 1st ODI: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన శుభ్మన్ గిల్.. తనదైన ఆటతో అభిమానులకు మాంచి కిక్ ఇచ్చాడు. తొలుత సెంచరీ, ఆ తర్వాత డబుల్ సెంచరీతో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకపడ్డాడు. చివర్లో వరుస సిక్సులతో బౌలర్లకు చుక్కలు చూపించిన గిల్.. డబుల్ సెంచరీ చేశాక పెవిలియన్ చేరాడు. దీంతో కెరీర్‌లో ఎన్నో మైళురాళ్లను తన పేరుతో లిఖించుకున్నాడు.

గిల్ 208(149 బంతులు, 19 ఫోర్లు, 9 సిక్సులు) పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 139 స్ట్రైక్ రేట్‌తో బౌండరీలు బాదేసిన గిల్.. చివరి ఓవర్లో ఔటయ్యాడు. ఈ క్రమంలో వన్డేల్లో అతి తక్కువ ఏజ్‌లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

ఉప్పల్ స్టేడియంలో ఫస్ట్ టైం డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్ గా గిల్ రికార్డు నెలకొల్పాడు. అలాగే,  ఉప్పల్ స్టేడియం లో ఇండియా న్యూజిలాండ్ మొదటి వన్డే లో రెండు రికార్డులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇక ఉప్పల్ లో మొదటి డబుల్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్ గా శుభమన్ గిల్ సరికొత్త చరిత్ర సాధించాడు. గిల్ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్‌తో ఉప్పల్ లో ఇండియా అత్యధిక స్కోరు 349 నమోదు చేసింది. అంతకుముందు ఆస్ట్రేలియా పై ఉప్పల్ స్టేడియంలో 347 పరుగుల రికార్డ్‌ను బ్రేక్ చేసింది.

ఈ ఇన్నింగ్స్‌లో 106 పరుగులు చేసిన తర్వాత గిల్ 1000 పరుగులు పూర్తి చేశాడు. విరాట్, ధావన్ శుభ్‌మన్ గిల్ వన్డే క్రికెట్‌లో 1000 వేల పరుగులు పూర్తి చేశారు. ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గిల్ 19 వన్డేల్లో 19 ఇన్నింగ్స్‌ల్లో 1000 వన్డే పరుగులు పూర్తి చేశాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ పేరిట ఉండేది. విరాట్ 27 మ్యాచ్‌ల్లో 24 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును సాధించగా, ధావన్ 24 మ్యాచ్‌ల్లో 24 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును సాధించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..