AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ 1st ODI: డబుల్ సెంచరీతో దుమ్మురేపిన గిల్.. న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్..

శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ ఆధారంగా భారత్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌కి 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది.

IND vs NZ 1st ODI: డబుల్ సెంచరీతో దుమ్మురేపిన గిల్.. న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్..
Shubman Gill4
Venkata Chari
|

Updated on: Jan 18, 2023 | 5:38 PM

Share

శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ ఆధారంగా భారత్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌కి 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. గిల్ తన వన్డే కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. 149 బంతుల్లో 208 పరుగులు చేసిన గిల్.. 50వ ఓవర్‌లో ఔటయ్యాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన 5వ భారత ఆటగాడిగా నిలిచాడు.

అతని ముందు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ మాత్రమే ఈ ఘనత సాధించగలిగారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాట్స్‌మెన్ గురించి మాట్లాడితే, వన్డేల్లో డబుల్ సెంచరీ 10 వ సారి వచ్చింది. వీటిలో అత్యధికంగా 5 డబుల్ సెంచరీలు భారత బ్యాట్స్‌మెన్‌లు నమోదు చేశారు.

హార్దిక్ పాండ్యా (28 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (31 పరుగులు), రోహిత్ శర్మతో కలిసి గిల్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కు గిల్ 74 పరుగులు, సూర్యతో కలిసి నాలుగో వికెట్‌కు 65 పరుగులు, రోహిత్‌తో కలిసి తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించారు.

పాండ్యా కంటే ముందు శార్దూల్ 3, సుందర్ 12, సూర్య 28, ఇషాన్ కిషన్ 5, విరాట్ కోహ్లీ 8, కెప్టెన్ రోహిత్ శర్మ 34 పరుగుల వద్ద ఔటయ్యారు.

డారిల్ మిచెల్ 2 వికెట్లు తీశాడు. అదే సమయంలో లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీశారు.

ఘనంగా GTA మెగా కన్వెన్షన్.. అభినందించిన త్రిదండి చినజీయర్ స్వామి
ఘనంగా GTA మెగా కన్వెన్షన్.. అభినందించిన త్రిదండి చినజీయర్ స్వామి
కుంభ రాశి వార్షిక ఫలితాలు 2026: కొద్దిపాటి కష్టనష్టాలు
కుంభ రాశి వార్షిక ఫలితాలు 2026: కొద్దిపాటి కష్టనష్టాలు
ఒక కప్పు కాఫీ మీ పిల్లలకు ఎంత ప్రమాదకరమో తెలుసా?
ఒక కప్పు కాఫీ మీ పిల్లలకు ఎంత ప్రమాదకరమో తెలుసా?
వార్నీ.. భారతీయుల దగ్గర ఇంత బంగారం ఉందా.. పసిడి లెక్కలు చూస్తే..
వార్నీ.. భారతీయుల దగ్గర ఇంత బంగారం ఉందా.. పసిడి లెక్కలు చూస్తే..
2026లో తులారాశి వారికి రాజయోగం.. జీవితంలో కొత్త మలుపే
2026లో తులారాశి వారికి రాజయోగం.. జీవితంలో కొత్త మలుపే
న్యూమరాలజీ.. 2026లో గవర్నమెంట్ జాబ్ కొట్టేది వీరే.. మీరున్నారా
న్యూమరాలజీ.. 2026లో గవర్నమెంట్ జాబ్ కొట్టేది వీరే.. మీరున్నారా
మకర రాశి వార్షిక ఫలితాలు 2026: కొత్త సంవత్సరంలో ఆదాయ వృద్ధి పక్కా
మకర రాశి వార్షిక ఫలితాలు 2026: కొత్త సంవత్సరంలో ఆదాయ వృద్ధి పక్కా
ఎవడు మమ్మీ వీడు..ఆరు బంతుల్లో 24 పరుగులా ?
ఎవడు మమ్మీ వీడు..ఆరు బంతుల్లో 24 పరుగులా ?
ఒక్క సంతానం ఉండటం మంచిది కాదా.. ఇది తెలుసుకోకపోతే అరిష్టమే!
ఒక్క సంతానం ఉండటం మంచిది కాదా.. ఇది తెలుసుకోకపోతే అరిష్టమే!
ఏలి నాటి శనితో కష్టాలు పడుతున్నారా.. పాటించాల్సిన పరిహారాలు ఇవే
ఏలి నాటి శనితో కష్టాలు పడుతున్నారా.. పాటించాల్సిన పరిహారాలు ఇవే