IND vs ENG: ‘సిరాజ్‌ని ఆడించొద్దు.. రోహిత్ శర్మపై మాజీ వికెట్ కీపర్ విమర్శలు..
India vs England Test Series: మహ్మద్ సిరాజ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 7 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అతని సహచర ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 24.4 ఓవర్లు వేసి, 6 వికెట్లు పడగొట్టాడు. భారత్-ఇంగ్లండ్‌ల మధ్య సిరీస్‌లోని తదుపరి టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో జరగనుంది. దీనిలో భారత జట్టు పునరాగమనం చేయగలదని అంతా భావిస్తున్నారు.

Mohammed Siraj: భారత క్రికెట్ జట్టు(Indian Cricket Team) మాజీ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్, వ్యాఖ్యాత పార్థివ్ పటేల్ (Parthiv Patel) మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)ను ప్లేయింగ్ 11లోకి తీసుకోవడంపై విమర్శలు గుప్పించాడు. సిరాజ్‌ను బాగా ఉపయోగించుకోకపోతే భారత జట్టు జట్టులోకి తీసుకోకూడదని అభిప్రాయపడ్డాడు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 11 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత పార్థివ్ పటేల్ భారత జట్టుపై విమర్శలు గుప్పించాడు. మీకు సిరాజ్ ఉపయోగం తెలియకపోతే.. అతన్ని జట్టులో ఎంపిక చేయవద్దంటూ సూచించాడు.
ఈ నేపథ్యంలో మాజీ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. కానీ నా దృక్కోణం భిన్నంగా ఉంది. మీరు మొత్తం టెస్ట్ మ్యాచ్‌లో సిరాజ్‌ని 6 లేదా 7 ఓవర్లు మాత్రమే ఉపయోగించారు. టెస్ట్ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ ఎత్తి చూపినట్లుగా, అక్షర్ పటేల్ అతని బ్యాటింగ్ సామర్థ్యాల కారణంగా కుల్దీప్ యాదవ్ కంటే ముందున్నాడు. మీకు వెరైటీ కావాలంటే అక్షర కంటే ముందు కుల్దీప్‌ని ఎంచుకోవచ్చు’ అంటూ సూచించాడు.
మీరు సిరాజ్‌ను ఎక్కువగా ఉపయోగించకపోతే అదనపు బ్యాట్స్‌మెన్‌ను ఎందుకు ఆడకూడదు అంటూ పార్థివ్ పటేల్ ప్రశ్నించాడు. అప్పుడు మీకు అశ్విన్, జడేజా, కుల్దీప్ రూపంలో మూడు రకాల బౌలర్లు ఉంటారు. అదనపు బ్యాట్స్‌మెన్ రూపంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో డెప్త్ కూడా అందుబాటులో ఉంటుంది. ఎవరికైనా 7 ఓవర్లు మాత్రమే ఇస్తే, అతనిని ఆడించడంలో అర్థం లేదంటూ ఈ మాజీ ప్లేయర్ ప్రశ్నల వర్షం కురిపించాడు.
It came right down to the wire in Hyderabad but it’s England who win the closely-fought contest.#TeamIndia will aim to bounce back in the next game.
Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/OcmEgKCjUT
— BCCI (@BCCI) January 28, 2024
మహ్మద్ సిరాజ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 7 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అతని సహచర ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 24.4 ఓవర్లు వేసి, 6 వికెట్లు పడగొట్టాడు. భారత్-ఇంగ్లండ్‌ల మధ్య సిరీస్‌లోని తదుపరి టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో జరగనుంది. దీనిలో భారత జట్టు పునరాగమనం చేయగలదని అంతా భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




