IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌..కోహ్లీ స్థానంలో ఎవరూ ఊహించని ప్లేయర్‌.. బీసీసీఐ బిగ్‌ ట్విస్ట్‌

ఇంగ్లండ్ తో టీమిండియాతో సిరీస్ ప్రారంభం కాకముందే జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ 2 మ్యాచ్‌ల నుంచి వైదొలిగాడు.  వ్యక్తిగత కారణాల వల్ల ఈ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ తెలిపింది.

IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌..కోహ్లీ స్థానంలో ఎవరూ ఊహించని ప్లేయర్‌.. బీసీసీఐ బిగ్‌ ట్విస్ట్‌
Virat Kohli
Follow us
Basha Shek

|

Updated on: Jan 23, 2024 | 8:44 AM

జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ హైదరాబాద్‌లో జరగనుండగా, రెండో టెస్టు విశాఖపట్నంలో జరగనుంది. అయితే ఇంగ్లండ్ తో టీమిండియాతో సిరీస్ ప్రారంభం కాకముందే జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ 2 మ్యాచ్‌ల నుంచి వైదొలిగాడు.  వ్యక్తిగత కారణాల వల్ల ఈ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. జట్టులో కోహ్లి స్థానాన్ని బీసీసీఐ ఇంకా ఎంపిక చేయలేదు. అయితే జట్టులో విరాట్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముగ్గురు ఆటగాళ్లు రేసులో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రంజీల్లో ఈ ముగ్గురు అద్భుత ప్రదర్శన చేశారు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా ఈ ఆటగాళ్లు మంచి ఆటతీరు కనబరిచారు. వారెవరంటే?

రేసులో ముగ్గురున్నా..

ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లలో సర్ఫరాజ్ వరుసగా 96, 55 పరుగులు చేశాడు. మునుపటి మూడు రంజీ ట్రోఫీ ఎడిషన్లలో 154, 122, 91 సగటుతో, సర్ఫరాజ్ 2020 నుండి దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవల భారత్ వన్డే జట్టులో చోటు దక్కించుకున్న రజత్ పాటిదార్ ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో వరుసగా 151, 111 పరుగులు చేశాడు. పేస్ అండ్‌ స్పిన్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొనడం రజత్‌ కు ప్లస్‌ పాయింట్‌. 35 ఏళ్ల పుజారా ఇటీవల రంజీ ట్రోఫీలో జార్ఖండ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. అలాగే మొన్నటి మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. కాబట్టి టీమ్ ఇండియాకు దూరమైన పుజారా మళ్లీ జట్టులోకి రావడానికి ఇదే మంచి అవకాశం.

ఇవి కూడా చదవండి

సుయాస్‌కే అవకాశం ..

అయితే వీరితో పాటు దేశీవాళీ క్రికెట్‌లో పరుగులు వరద పారిస్తున్న గోవా యువ ఆటగాడు సుయాస్‌ ప్రభుదేశాయ్‌ పేరును బీసీసీఐ సెలక్టర్లు పరిశీలీస్తున్నట్లు తెలుస్తోంది. రంజీ ట్రోఫీ సీజన్‌-2024లో సుయాస్‌ అదరగొడుతున్నాడు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన సుయాస్‌ 386 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ప్రభుదేశాయ్‌కు మంచి రికార్డు ఉంది. 29 మ్యాచ్‌ల్లో 47.97 సగటుతో 2015 పరుగులు చేశాడు.

తొలి 2 టెస్టులకు టీమిండియా :

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యస్సవి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..