IND Vs AUS: టీమిండియాకి ఇక చెడుగుడే.. ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్‌కు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందుగా ఆస్ట్రేలియా తన తప్పులను సరిదిద్దుకునే పనిలో పడింది. టీమిండియాను చెడుగుడు చేసే మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా. తమ ఓపెనింగ్ జోడీలో మార్పులు చేస్తూ..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందుగా ఆస్ట్రేలియా తన తప్పులను సరిదిద్దుకునే పనిలో పడింది. ఇప్పటిదాకా ఓపెనర్‌గా బరిలోకి దిగుతోన్న టెస్ట్ స్పెషలిస్ట్ స్టీవ్ స్మిత్.. టీమిండియాతో జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 4వ స్థానంలో ఆడనున్నాడు. వాస్తవానికి డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత, టెస్టుల్లో ఓపెనర్‌గా స్టీవ్ స్మిత్ రంగంలోకి దిగాడు.
ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి
ఉస్మాన్ ఖవాజాతో పలు మ్యాచ్‌లలో ఓపెనర్‌గా రాణించాడు స్మిత్. అయితే గత కొద్ది నెలలుగా ట్రావిస్ హెడ్ ప్రతీ ఫార్మటులోనూ రాణిస్తుండటంతో.. డిసెంబర్‌లో టీమిండియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో స్మిత్ నాలుగో స్థానంలో, హెడ్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతారని తెలుస్తోంది. స్టీవ్ స్మిత్ ఇప్పటివరకు 109 టెస్టులు ఆడాడు. ఇందులో అతడు 56.97 సగటుతో 9685 పరుగులు చేశాడు. ఇక స్మిత్ ఓపెనర్‌గా 4 టెస్టులు ఆడాడు. ఈ సమయంలో అతడు 28.50 సగటుతో 171 పరుగులు చేశాడు.
ఇది చదవండి: బాలికతో 20 రోజులు ఓయో రూమ్‌లో.. చివరికి తను ఏం చేసిందంటే
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఉస్మాన్ ఖవాజాతో ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ జోడిగా బరిలోకి దిగుతాడు. దీంతో టాప్ 4 స్థానాల్లో ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేయనున్నారు. ఆస్ట్రేలియాకు ఇది ది బెస్ట్ టాప్ 4 అని చెప్పొచ్చు. ఇక భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నవంబర్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ రెండు జట్లు 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ నవంబర్‌లో పెర్త్‌లో జరగనుంది. చివరి మ్యాచ్ 3 జనవరి 2025 నుండి సిడ్నీలో జరుగుతుంది.
ఇది చదవండి: టీ20లకే మొనగాడురా.! 12 ఫోర్లు, 5 సిక్సర్లతో కావ్యపాప ప్లేయర్ ఊచకోత
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..