Team India: టెస్ట్ క్రికెట్‌ను ఏలే మొనగాడు మనోడే.. ఫ్యూచర్ అంతా ఆయనదే: టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ
Rishabh Pant: టెస్టు క్రికెట్‌లో రిషబ్ పంత్ గొప్ప బ్యాట్స్‌మెన్‌గా ఎదగగలడని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. కోల్‌కతాలో జరిగిన ఓ ఈవెంట్‌లో గంగూలీ మాట్లాడుతూ, 'పంత్ టెస్టు క్రికెట్‌లో దిగ్గజ బ్యాట్స్‌మెన్‌గా ఎదగాలని చూస్తున్నాడు. అయితే, అంతకుముందు పొట్టి ఫార్మాట్‌లో మెరుగవ్వాలి' అని సూచించాడు. 26 ఏళ్ల స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడి దాదాపు ఒకటిన్నర సంవత్సరాల తర్వాత IPLతో రీఎంట్రీ ఇచ్చాడు.
Rishabh Pant: టెస్టు క్రికెట్‌లో రిషబ్ పంత్ గొప్ప బ్యాట్స్‌మెన్‌గా ఎదగగలడని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. కోల్‌కతాలో జరిగిన ఓ ఈవెంట్‌లో గంగూలీ మాట్లాడుతూ, ‘పంత్ టెస్టు క్రికెట్‌లో దిగ్గజ బ్యాట్స్‌మెన్‌గా ఎదగాలని చూస్తున్నాడు. అయితే, అంతకుముందు పొట్టి ఫార్మాట్‌లో మెరుగవ్వాలి’ అని సూచించాడు. 26 ఏళ్ల స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడి దాదాపు ఒకటిన్నర సంవత్సరాల తర్వాత IPLతో రీఎంట్రీ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో అతడు కూడా సభ్యుడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇప్పుడు మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చాడు. బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టుకు అతను జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. పంత్ తన చివరి టెస్టును 2022లో బంగ్లాదేశ్‌తో ఆడాడు.
రిషబ్ పంత్ గురించి సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, ‘భారత్‌లోని అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మెన్‌లలో రిషబ్‌ను నేను ఒకరిగా భావిస్తున్నాను. అతను తిరిగి జట్టులోకి వచ్చినందుకు నేను ఆశ్చర్యపోను. అయితే, అతను టెస్టుల్లో భారత్‌కు ఆడటం కొనసాగించాలి అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఇలాగే రాణిస్తే టెస్టుల్లో ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. నా అభిప్రాయం ప్రకారం, అతను పొట్టి ఫార్మాట్లలో మెరుగవ్వాలి. అతనికి ఉన్న ప్రతిభతో, కాలక్రమేణా అతను అత్యుత్తమంగా మారుతాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని గంగూలీ తేల్చేశాడు.
షమీ ఫిట్‌నెస్‌పైనా గంగూలీ మాట్లాడాడు. చీలమండ ఆపరేషన్ కారణంగా అతను జట్టుకు దూరంగా ఉన్నాడు. షమీ గురించి గంగూలీ మాట్లాడుతూ.. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఆస్ట్రేలియా పర్యటనలోపు ఫాస్ట్ బౌలర్ పూర్తి ఫిట్‌గా ఉంటాడని నాకు నమ్మకం ఉందని తెలిపాడు.
ప్రస్తుతం భారత్ బౌలింగ్ ఎటాక్ చాలా బాగుంది. నేను ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎదురుచూస్తున్నాను. జట్టుకు అసలైన పరీక్ష అక్కడే ఉంటుంది. ఆ తర్వాత జట్టు జులైలో ఇంగ్లాండ్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ రెండు పర్యటనలు భారతదేశానికి చాలా ముఖ్యమైనవి. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఉనికితో పాటు షమీ తిరిగి రావడం భారత ఫాస్ట్ బౌలింగ్ దాడిని మరింత బలోపేతం చేస్తుందని గంగూలీ ఉద్ఘాటించాడు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య సెప్టెంబరు 19 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇటీవల స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ 2-0తో పాకిస్థాన్‌ను ఓడించింది. దీనిపై గంగూలీ మాట్లాడుతూ.. భారత్‌ను ఓడించడం బంగ్లాదేశ్‌కు చాలా కష్టమని అన్నాడు. పాకిస్థాన్‌ను సొంత గడ్డపై ఓడించడం అంత సులువు కాదు. కాబట్టి బంగ్లాదేశ్ ఆటగాళ్లకు అభినందనలు. కానీ భారత జట్టు భిన్నంగా ఉంటుంది. ప్రతి ఫార్మాట్‌లో భారత్ బాగా రాణిస్తుంది. జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ పటిష్టంగా ఉండడంతో భారత్‌లో బంగ్లాదేశ్ గెలవడం కష్టమేనని ఆయన తెలిపారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..