వరల్డ్‌కప్ 2019: ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా విజయం
ప్రపంచకప్ కు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న ఇంగ్లాండ్ ను వార్మప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 12 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన కంగారులు స్టీవ్ స్మిత్ (115) అజేయ శతకంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ప్లన్‌కట్ 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 49.3 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది. జేమ్స్ […]
ప్రపంచకప్ కు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న ఇంగ్లాండ్ ను వార్మప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 12 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన కంగారులు స్టీవ్ స్మిత్ (115) అజేయ శతకంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ప్లన్‌కట్ 4 వికెట్లు పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 49.3 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది. జేమ్స్ విన్స్ (64), జోస్ బట్లర్ (52), క్రిస్ వోక్స్ (40) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెరెన్‌డార్ఫ్ (2/43), కేన్ రిచర్డ్‌సన్ (2/51) కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు.