తొలి వార్మప్‌ మ్యాచ్‌లో చేతులెత్తేసిన భారత్

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా లండన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత్ చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. 39.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ బ్యాటింగ్ పవర్‌ప్లే ముగిసేలోపే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కేన్ విలియమ్‌సన్, రాస్ టేలర్‌లు కలిసి జట్టుకు అండగా నిలిచారు. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కి 114 పరుగులు జోడించారు. ఈ […]

తొలి వార్మప్‌ మ్యాచ్‌లో చేతులెత్తేసిన భారత్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 25, 2019 | 9:49 PM

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా లండన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత్ చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. 39.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ బ్యాటింగ్ పవర్‌ప్లే ముగిసేలోపే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కేన్ విలియమ్‌సన్, రాస్ టేలర్‌లు కలిసి జట్టుకు అండగా నిలిచారు. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కి 114 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు చేశారు. అయితే చాహల్ వేసిన 30వ ఓవర్ ఐదో బంతికి విలియమ్‌సన్ 67పరుగులు చేసి రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక విజయానికి 1 పరుగు అవసరం ఉండగా.. 71పరుగులు చేసిన రాస్ టేలర్ కూడా వెనుదిరిగాడు. చివరిగా.. హెర్నీ నికోలస్ కావాల్సిన ఒక్క పరుగు చేయడంతో న్యూజిలాండ్ 37.1 ఓవర్లలో 180 పరుగులు చేసి.. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.