వరల్డ్‌కప్ 2019: వార్మప్ మ్యాచ్‌లో ఫీల్డర్‌గా ఇంగ్లాండ్ కోచ్

శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఓ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంది. ఒకవేళ మైదానంలో ఆడుతున్న ఓ ఆటగాడు గాయపడితే.. మరొక ఆటగాడిని సబ్‌స్టిట్యూట్‌గా పంపుతారు. కానీ ప్రత్యామ్నాయ ఆటగాడే లేకపోతే..! సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది ఇంగ్లీష్ జట్టు. ప్రత్యామ్నాయ ఆటగాడు ఎవరూ లేకపోయేసరికి.. సహాయక కోచ్ పాల్ కాలింగ్‌వుడ్‌ సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్‌ చేయడానికి మైదానంలోకి అడుగుపెట్టాడు. ఇక గాయాలతో కెప్టెన్‌ మోర్గాన్‌, స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ ఆరంభానికి ముందే మ్యాచ్‌ […]

వరల్డ్‌కప్ 2019: వార్మప్ మ్యాచ్‌లో ఫీల్డర్‌గా ఇంగ్లాండ్ కోచ్
Follow us
Ravi Kiran

|

Updated on: May 26, 2019 | 12:10 PM

శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఓ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంది. ఒకవేళ మైదానంలో ఆడుతున్న ఓ ఆటగాడు గాయపడితే.. మరొక ఆటగాడిని సబ్‌స్టిట్యూట్‌గా పంపుతారు. కానీ ప్రత్యామ్నాయ ఆటగాడే లేకపోతే..! సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది ఇంగ్లీష్ జట్టు. ప్రత్యామ్నాయ ఆటగాడు ఎవరూ లేకపోయేసరికి.. సహాయక కోచ్ పాల్ కాలింగ్‌వుడ్‌ సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్‌ చేయడానికి మైదానంలోకి అడుగుపెట్టాడు.

ఇక గాయాలతో కెప్టెన్‌ మోర్గాన్‌, స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ ఆరంభానికి ముందే మ్యాచ్‌ నుంచి వైదొలగగా.. రూట్‌కు విశ్రాంతినిచ్చారు. ఐతే.. ఫీల్డింగ్‌ చేస్తూ మార్క్‌వుడ్‌ గాయపడటంతో రూట్‌ ఫీల్డింగ్‌కు రావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆర్చర్‌ కూడా గాయపడటంతో ఫీల్డింగ్‌ కోచ్‌.. 42 ఏళ్ల కాలింగ్‌వుడ్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు.