కంగారూలకు.. అప్పుడే సెగ మొదలైంది.!

సౌథాంప్టన్‌ వేదికగా శనివారం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల మధ్య ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్ జరిగింది. బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధం తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు పునరాగమనం చేశారు. వీరు ఇలా అడుగుపెట్టారు.. అంటే ఇంగ్లీష్ అభిమానుల సెగ మొదలైంది. మొదట బ్యాటింగ్‌కు వచ్చిన వార్నర్‌ను.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన స్టీవ్ స్మిత్‌ను ఇంగ్లీష్ అభిమానులు ‘మోసగాడు.. మోసగాడు..వెళ్ళిపో’ అంటూ గేలి చేశారు. మరోవైపు ఈ […]

కంగారూలకు.. అప్పుడే సెగ మొదలైంది.!
Follow us
Ravi Kiran

|

Updated on: May 26, 2019 | 12:59 PM

సౌథాంప్టన్‌ వేదికగా శనివారం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల మధ్య ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్ జరిగింది. బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధం తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు పునరాగమనం చేశారు. వీరు ఇలా అడుగుపెట్టారు.. అంటే ఇంగ్లీష్ అభిమానుల సెగ మొదలైంది. మొదట బ్యాటింగ్‌కు వచ్చిన వార్నర్‌ను.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన స్టీవ్ స్మిత్‌ను ఇంగ్లీష్ అభిమానులు ‘మోసగాడు.. మోసగాడు..వెళ్ళిపో’ అంటూ గేలి చేశారు.

మరోవైపు ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్(43) రాణించగా.. స్టీవ్ స్మిత్(112) అజేయ శతకం సాధించాడు. దీనితో ఆస్ట్రేలియా 12 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను మట్టి కరిపించింది.