ICC Hall Of Fame: ఘోర తప్పిదం చేసిన ఐసిసి.. విపరీతంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఇంతకీ ఆ తప్పేంటంటే..

ICC Hall Of Fame: హాల్ ఆఫ్ ఫేమ్‌లో భాగమైన 26 మందితో కూడిన ఆటగాళ్ల సమగ్ర జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తాజాగా విడుదల చేసింది.

ICC Hall Of Fame: ఘోర తప్పిదం చేసిన ఐసిసి.. విపరీతంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఇంతకీ ఆ తప్పేంటంటే..
Icc
Follow us

|

Updated on: May 25, 2021 | 9:27 PM

ICC Hall Of Fame: హాల్ ఆఫ్ ఫేమ్‌లో భాగమైన 26 మందితో కూడిన ఆటగాళ్ల సమగ్ర జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్, భారత మాజీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, శ్రీలంక మాజీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ తదితరులు ఉన్నారు. అయితే, ఈ జాబితా విడుదలలో ఐసీసీ ఘోరమైన తప్పిదం చేసింది. ఈ తప్పిదాన్ని గుర్తించిన నెటిజన్లు ఐసీసీని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. ఇంతకీ ఆ తప్పు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హాల్ ఆఫ్ ఫేమ్ జాబితా విడుదల చేసిన ఐసీసీ.. సదరు క్రికెటర్ల ఘనతను వివరిస్తూ వీడియోను, గ్రాఫిక్ ఫోటోను విడుదల చేసింది. అయితే, తొలుత విడుదల చేసిన గ్రాఫిక్ ఫోటోలో వకార్ యూనిస్ భారతదేశం తరఫున ఆడినట్లు పేర్కొంది. ఇదే ఇప్పుడు తెగ రచ్చ అయ్యింది. వాస్తవానికి వకార్ యూనిస్ పాకిస్తాన్ తరఫున ఆడారు. అద్భుతమైన బౌలింగ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అతని గొప్పతనాన్ని గుర్తించి ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చేర్చింది. వకార్ యూనిస్ ప్రత్యేకతను చాటుతూ అతను ఆడిన క్రికెట్ మ్యాచ్‌లు, తీసుకున్న వికెట్ల వివరాలు అన్నీ వెల్లడిస్తూ ఒక గ్రాఫిక్ ఫోటోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. అయితే, ఈ ఫోటో భారత్ తరఫున వకార్ యూనిస్ ఆడినట్లు పేర్కొని పెద్ద పొరపాటు చేసింది. ఐసిసి చేసిన పొరపాటును గుర్తించిన నెటిజన్లు ఐసిసిని ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. చివరికి జరిగిన పొరపాటును గుర్తించిన ఐసిసి ఆ గ్రాఫిక్ ఫోటోను మార్చింది.

Also read:

SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు అల‌ర్ట్‌… జూలై 1 నుంచి అమ‌ల్లోకి కొత్త ఛార్జీలు.. ఏటీఎం ట్రాన్సాక్ష‌న్స్‌పై..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే